166. నూట అరువది ఆరవ అధ్యాయము

కౌరవ రథాతిరథ సంఖ్యానము - 2.

భీష్మ ఉవాచ
సుదక్షిణస్తు కాంబోజః రథ ఏకగుణో మతః।
తవార్థసిద్ధిమాకాంక్షన్ యోత్స్యతే సమరే పరైః॥ 1
కాంబోజదేశరాజు సుదక్షిణు డొక రథికుడు. అతడు నీ కార్యసిద్ధి కోరుతూ రణంలో శత్రువులతో పోరాడుతాడు. (1)
ఏతస్య రథసింహస్య తవార్థే రాజసత్తమ।
పరాక్రమం యథేంద్రస్య ద్రక్ష్యంతి కురవో యుధి॥ 2
రాజోత్తమా! రథికోత్తముడయిన ఈ కాంబోజరాజు యుద్ధంలో మహేంద్ర సమాన పరాక్రమాన్ని ప్రదర్శిస్తే కౌరవులందరూ చూస్తారు. (2)
ఏతస్య రథవంశే హి తిగ్మవేగప్రహారిణః।
కామ్బోజానాం మహారాజ శలభానామివాయతిః॥ 3
ప్రచండవేగంతో శత్రువులను కొట్టే యీ కాంబోజరాజు యొక్క రథికుల సమూహంలో సైనికులు మిడతల దండువలె విస్తారంగా కనబడుతున్నారు. (3)
వి॥సం॥ రథవంశే = రథసమూహమందు(అర్జు) ఆయతిః = పంక్తులు(అర్జు)
నీలో మాహిష్మతీవాసీ నీలవర్మా రథస్తవ।
రథవంశేన కదనం శత్రూణాం వై కరిష్యతి॥ 4
మాహిష్మతీపురంలో నివసించే నీలుడు నీ సైన్యంలో రథికుడు. నీలంరంగు కవచం ధరించి అతడు తన రథసమూహం ద్వారా శత్రుసంహారం చేస్తాడు. (4)
వి॥సం॥ రథవంశేన = రథసంఘంతో(నీల)
కదనం = క్లేశం కాని, నాశం కాని(అర్జు)
కృతవైరః పురా చైవ సహ్దేవేన మారిష।
యోత్స్యతే సతతం రాజన్ తవార్థే కురునందన॥ 5
వి॥ దక్షిణ గోగ్రహణంలో అర్జునుడు తప్ప మిగిలిన నలుగురు పాండవులూ పాల్గొన్నారు.
మకరా ఇవ రాజేంద్ర సముద్ధతతరంగిణీమ్।
గంగాం విక్షోభయిష్యంతి పార్థానాం యుధి వాహినీమ్॥ 10
రాజేంద్రా! ఎత్తయిన తరంగాలు కలిగిన గంగను మొసళ్లు క్షోభింప చేసినట్లుగా త్రిగర్త దేశానికి చెందిన అయిదుగురు క్షత్రియవీరులు పాండవుల సైన్యాన్ని క్షోభింపచేస్తారు. (10)
వి: సముద్ధత తరంగిణీ = ఎత్తబడిన జెండాలు కలిగిన సేన, ఎత్తయిన తరంగములు కలిగిన గంగ అని రెండర్థాలు చెప్పవచ్చు. (నీల)
గంగే వాక్షోభయిష్యంతి అనే పాఠంలో నా శబ్దానికి 'వలె' అని అర్థమ్ (అర్జు)
తే రథాః పంచ రాజేంద్ర యేషాం సత్యరథో ముఖమ్।
ఏతే యోత్స్యంతి సంగ్రామే సంస్మరంతః పురాకృతమ్॥ 11
వ్యళికం పాండవేయేన భీమసేనానుజేన చ।
దిశో విజయతా రాజన్ శ్వేతవాహేన భారత॥ 12
మహారాజా! ఈ అయిదుగురు రథికులు సోదరులు. వీరిలో సత్యరథుడు ప్రధానుడు. భారతా! తెల్లని గుఱ్ఱములు కల అర్జునుడు దిగ్విజయ సమయంలో త్రిగర్తులకు అప్రియం చేశాడు. ఆ పాతవైరాన్ని గుర్తుంచుకొని యీ అయిదుగురువీరులు యుద్ధం చేస్తారు. (11-12)
వి॥సం॥ సత్యరథుడు అయిదుగురిలో ముఖం = శ్రేష్ఠుడు (నీల) భీముడు విరాట నగరంలోను, అర్జునుడు దిగ్విజయంలోను ఇతనికి అపరాధం చేశారు. (అర్జు)
వ్యళీకమ్ = అప్రియం(లక్షా)
తే హనిష్యంతి పార్థానాం తవాసాద్య మహారథాన్।
వరాన్ వరాన్ మహేష్వాసాన్ క్షత్రియాణాం ధురంధరాన్॥ 13
వీరు పాండవులలో గొప్ప గొప్ప మహారథికుల దగ్గరకు వెళ్ళి మహాధనుర్ధారులు, క్షత్రియ శిరోమణులు అయిన వారిని సంహారం చేస్తారు. (13)
లక్ష్మణస్తవ పుత్రశ్చ తథా దుశ్శాసనస్య చ।
ఉభౌ తౌ పురుషవ్యాఘ్రౌ సంగ్రామేష్వపలాయినౌ॥ 14
మీ కుమారుడయిన లక్ష్మణుడు, దుశ్శాసనుని కుమారుడు, వీరిద్దరూ పురుషశ్రేష్ఠులు. యుద్ధంలో పారిపోరు. (14)
తరుణౌ సుకుమారౌ చ రాజపుత్రౌ తరస్వినౌ।
యుద్ధానాం చ విశేషజ్ఞౌ ప్రణేతారౌ చ సర్వశః॥ 15
తరుణులు, సుకుమారులు అయిన ఈ రాజపుత్రులు మిక్కిలి వేగశాలులు, వీరనేక యుద్ధాల విశేషాల నెరిగిన వారు. వీరన్ని విధాలా సేనానాయకులు కాదగినవారు. (15)
విశే: సుకుమారులయినా రథసత్తములని విరోధాభాసాలంకారం. (అర్జు)
రథౌ తౌ కురుశార్దూల మతౌ మే రథసత్తమౌ।
క్షత్రధర్మరతౌ వీరౌ మహత్ కర్మ కరిష్యతః॥ 16
కురుశ్రేష్ఠా! ఈ వీరులిద్దరూ రథికులు మాత్రమే కాదు. రథికులలో శ్రేష్ఠులు. వీరు క్షత్రియ ధర్మాసక్తులు. యుద్ధంలో బాగా పరాక్రమిస్తారు. (16)
దండధారో మహారాజ రథ ఏకో వరర్షభ।
యోత్స్యతే తవ సంగ్రామే స్వేన సైన్యేన పాలితః॥ 17
మహారాజ! మన సైన్యంలో దండధారుడొక రథికుడు. అతడు తన సైన్యం చేత రక్షింపబడుతూ నీ కోసం రణరంగమ్లో యుద్ధం చేస్తాడు. (17)
వి॥ దండధారుడు = ధృతరాష్ట్రుడు పుత్రులలో ఒకడు.
బృహద్బలస్తథా రాజా కౌసల్యో రథసత్తమః।
రథో మమ మతస్తాత మహావేగపరాక్రమః॥ 18
నాయనా! గొప్పవేగమూ, పరాక్రమమూ కలిగిన కోసల దేశరాజు బృహద్బలుడు కూడా నా అభిప్రాయంలో రథికుడే. రథికులలో ఇతని స్థానం మిక్కిలి ఉన్నతమైనది. (18)
ఏష యోత్స్యతి సంగ్రామే స్వాన్ బంధూన్ సంప్రహర్షయన్।
ఉగ్రాయుధో మహేష్వాసః ధార్తరాష్ట్రహితే రతః॥ 19
ఇతడు ధృతరాష్ట్ర పుత్రులకు హితం చేసే ఆసక్తి కలవాడు. భయంకర మయిన అస్త్ర శస్త్రాలకూ గొప్ప ధనుస్సునూ ధరించి, తమ బంధువులకు బాగా సంతోషం కలిగిస్తూ సమరాంగణంలో యుద్ధం చేస్తాడు. (19)
కృపః శారద్వతో రాజన్ రథయూథప యూథపః।
ప్రియాన్ ప్రాణాన్ పరిత్యజ్య ప్రధక్ష్యతి రిపూంస్తవ॥ 20
రాజా! శరద్వంతుని కుమారుడైన కృపాచార్యుడు రథయూథపతులకు అధిపతి. అతడు తన ప్రియమయిన ప్రాణాలను లెక్క చేయకుండా నీ శత్రువులను తగులబెట్టగలడు. (20)
వి॥సం॥ రథయూథప యూథపః = చాలా రథులను రక్తించేవాడు అనియర్థం.
ప్రాణాన్ పరిత్యజ్య = ప్రాణాల పరిత్యాగానికి సంకల్పించి - ప్రాణాలయందు మమకారం లేకుండ(సర్వ)
గౌతమస్య మహర్షేర్యః ఆచార్యస్య శరద్వతః।
కార్తికేయ ఇవాజేయః శరస్తంభాత్ సుతోఽభవత్॥ 21
గౌతమ వంశ మహర్షి ఆచార్య శరద్వంతుని కుమారుడు కృపాచార్యుడు కార్తికేయుని వలె ఱెల్లుపొదలో ఆవిర్భవించాడు. అతనివలెనే ఈతడూ అజేయుడు. (21)
ఏష సేనాః సుబహులాః వివిధాయుధకార్ముకాః।
అగ్నివత్ సమరే తాత చరిష్యతి వినిర్దహన్॥ 22
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణీ రథాతిరథసంఖ్యాన పర్వణి షట్ షష్ట్యధిక శతతమోఽధ్యాయః ॥ 166 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున రథాతిరథసంఖ్యాన పర్వమను ఉపపర్వమున నూట అరువది ఆరవ ఆధ్యాయము. (166)