185. నూట ఎనుబది అయిదవ అధ్యాయము
ధృష్టద్యుమ్నుడు స్వయంవరాగత రాజులను ద్రౌపదికి పరిచయము చేయుట.
ధృష్టద్యుమ్న ఉవాచ
దుర్యోధనో దుర్విషహః దుర్ముఖో దుష్ర్పధర్షణః ।
వివింశతి ర్వికర్ణశ్చ సహో దుశ్శాసన స్తథా ॥ 1
యుయుత్సు ర్వాయువేగశ్చ భీమవేగరవస్తథా ।
ఉగ్రాయుధో బలాకీ చ కరకాయు ర్విరోచనః ॥ 2
కుండక శ్చిత్రసేనశ్చ సువర్చాః కనకధ్వజః ।
నందకో బాహుశాలీ చ సువర్చాః కనకధ్వజః ।
నందకో బాహుశాలీ చ తుహుండో వికట స్తథా ॥ 3
ఏతే చాన్యే చ బహవో దార్తరాష్ట్రా మహాబలాః ।
కర్ణేన సహితా వీరాః త్వదర్థం సముపాగతాః ॥ 4
ధృష్టద్యుమ్నుడు పలికాడు - దుర్యోధనుడు, దుర్విషహుడు, దుర్ముఖుడు, దుష్ప్రధర్షణుడు, వివింశతి, వికర్ణుడు, సహుడు, దుశ్శాసనుడు, యుయుత్సువు, వాయువేగుడు, భీమవేగరవుడు, ఉగ్రాయుధుడు, బలాకి, కరకాయువు, విరోచనుడు, కుండకుడు, చిత్రసేనుడు, సువర్చుడు, కనకధ్వజుడు, నందకుడు, బాహుశాలి, తుహుండుడు, వికటుడు మరెందరో మహావీరులైన ధృతరాష్ట్రకుమారులు కర్ణునితో కలిసి నీకోసం వచ్చారు. (1-4)
అసంఖ్యాతా మహాత్మానః పార్థివాః క్షత్రియర్షభాః ।
శకునిః సౌబలశ్చైవ వృషకోఽథ బృహద్బలః ॥ 5
ఏతే గాంధారరాజస్య సుతాః సర్వే సమాగతాః ।
అశ్వత్థామా చ భోజశ్చ సర్వశస్త్రభృతాం వరౌ ॥ 6
సమవేతౌ మహాత్మానౌ త్వదర్థే సమలంకృతౌ ।
బృహంతో మణిమాంశ్చైవ దండధారశ్చ పార్థివః ॥ 7
సహదేవజయత్సేనౌ మేఘసంధిశ్చ పార్థివః ।
విరాట స్సహపుత్రాభ్యాం శంఖేనైవోత్తరేణ చ ॥ 8
వార్థక్షేమిః సుశర్మాచ సేనాబిందుశ్చ పార్థివః ।
సుకేతుః సహపుత్రేణ సునామ్నా చ సువర్చసా ॥ 9
సుచిత్రః సుకుమారశ్చ వృకః సత్యధృతి స్తథా ।
సూర్యధ్వజో రోచమానః నీలశ్చిత్రాయుధస్తథా ॥ 10
అంశుమాంశ్చేకితానశ్చ శ్రేణిమాంశ్చ మహాబలః ।
సముద్రసేనపుత్రశ్చ చంద్రసేనః ప్రతాపవాన్ ॥ 11
జలసంధః పితాపుత్రౌ విదండో దండ ఏవ చ ।
పౌండ్రకో వాసుదేవశ్చ భగదత్తశ్చ వీర్యవాన్ ॥ 12
కాళింగస్తామ్రలిప్తశ్చ పత్తనాధిపతి స్తథా ।
మద్రరాజస్తథా శల్యః సహపుత్రో మహారథః ॥ 13
రుక్మాంగదేన వీరేణ తథా రుక్మరథేన చ ।
కౌరవ్యః సోమదత్తశ్చ పుత్రాశ్చాస్య మహారథాః ॥ 14
సమవేతాస్త్రయః శూరాః భూరి ర్భూరిశ్రవాః శలః ।
సుదక్షిణశ్చ కాంబోజః దృఢధన్వా చ పౌరవః ॥ 15
శకుని, వృషకుడు, బృహద్బలుడు వచ్చారు. వీరంతా గాంధారరాజకుమారులు. ఉత్తమయోధులైన అశ్వత్థామ, భోజుడు నీకోసమే విచ్చేశారు. బృహంతుడు, మణిమంతుడు, దండధారుడు, సహదేవ జయత్సేనులు, మేఘసంధి, కుమారులైన శంఖుడు, ఉత్తరులతో కలిసి విరాటరాజు, వార్ధక్షేమి, సుశర్మ, సేనాబిందువు, కుమారుడైన సువర్చసునితో కలసి సుకేతువు, సుచిత్రుడు, సుకుమారుడు, వృకుడు, సత్యధృతి, సూర్యధ్వజుడు, రోచమానుడు, నీలుడు, చిత్రాయుధుడు, దండుడు, పౌండ్రకవాసుదేవుడు, భగదత్తుడు, కాళింగతామ్రలిప్తుడు, పత్తనాధిపతి, మహారథుడైన మద్రరాజు శల్యుడు, అతనిపుత్రులు రుక్మాంగద రుక్మరథులు, భూరి, భూరిశ్రవసుడు, శలుడు అనే తన ముగ్గురు పుత్రులతో కలసి కౌరవ్యుడైన సోమదత్తుడు, కాంబోజరాజు సుదక్షిణుడు, పౌరవుడైన దృఢధన్యుడు --- (5-15)
బృహద్బలః సుషేణశ్చ శిబిరౌశీనర స్తథా ।
పటచ్చరనిహంతా చ కారూషాధిపతిస్తథా ॥ 16
సంకర్షణో వాసుదేవః రౌక్మిణేయశ్చ వీర్యవాన్ ।
సాంబశ్చ చారుదేష్ణశ్చ ప్రాద్యుమ్నిః సగదస్తథా ॥ 17
అక్రూరః సాత్యకిశ్చైవ ఉద్ధవశ్చ మహామతిః ।
కృతవర్మా చ హార్దిక్యః పృథుర్విపృథురేవ చ ॥ 18
విదూరథశ్చ కంకశ్చ శంకుశ్చ సగవేషణః ।
ఆశావహోఽనిరుద్ధశ్చ శమీకః సారిమేజయః ॥ 19
వీరో వాతపతిశ్చైవ ఝిల్లీ పిండారకస్తథా ।
ఉశీనరశ్చ విక్రాంతః వృష్ణయస్తే ప్రకీర్తితాః ॥ 20
బృహద్బలుడు, సుషేణుడు, ఔశీనరుడైన శిబి, దోపిడి దొంగలను సంహరించిన కారూషాధిపతి సంకర్షణుడు, వాసుదేవుడు, రౌక్మిణేయుడు, సాంబుడు, చారుదేష్ణుడు, ప్రాద్యుమ్ని, గదుడు, అక్రూరుడు, సాత్యకి, మహామతి ఉద్ధవుడు, ఆత్మీయుడైన కృతవర్మ, పృథువు, విపృథువు, విదూరథుడు, కంకుడు, గవేషణునితో కూడిన శంకుడు, ఆశావహుడు అనిరుద్ధుడు, శమీకుడు, సారిమేజయుడు, వీరుడైన వాతపతి, ఝిల్లి, పిండారకుడు, ఉశీనరుడు, విక్రాంతుడు వీరందరు ప్రసిద్ధమైన వృష్ణివంశంలో పుట్టినవారు. (16-20)
భగీరథో బృహత్క్షత్రః సైంధవశ్చ జయద్రథః ।
బృహద్రథో బాహ్లికశ్చ శ్రుతాయుశ్చ మహారథః ॥ 21
ఉలూకః కైతవో రాజా చిత్రాంగదశుభాంగదౌ ।
వత్సరాజశ్చ మతిమాన్ కోసలాధిపతిస్తథా ॥ 22
శిశుపాలశ్చ విక్రాంతః జరాసంధస్తథైవ చ ।
ఏతే చాన్యే చ బహవః నానాజనపదేశ్వరాః ॥ 23
త్వదర్థమాగతా భద్రే క్షత్రియాః ప్రథితా భువి ।
ఏతే భేత్స్యంతి విక్రాంతాః త్వదర్ధే లక్ష్యముత్తమమ్ ।
విధ్యేత య ఇదం లక్ష్యం వరయేథాః శుభేఽద్య తమ్ ॥ 24
భగీరథుడు, బృహత్క్షత్రుడు, సింధుదేశపురాజు జయద్రథుడు, బృహద్రథుడు, బాహ్లికుడు, మహారథుడైన శ్రుతాయువు, కైతవుడైన ఉలూకుడు, చిత్రాంగద శుభాంగదులు, వత్సరాజు, కోసలాధిపతి, శిశుపాలుడు, జరాసంధుడు, వీరేకాక మరెందరో సుప్రసిద్ధులైన క్షత్రియులు వివిధదేశాధిపతులు నీకోసం వచ్చారు. అమ్మా! నీకోసం వీరు లక్ష్యాన్ని భేదిస్తారు. ఎవడు ఈ లక్ష్యాన్ని భేదిస్తాడో వానిని వరింతువు గాక! (21-24)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి స్వయంవరపర్వణి రాజనామకీర్తనే పంచాశీత్యధిక శతతమోఽధ్యాయః ॥ 185 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున స్వయంవరపర్వమను
ఉపపర్వమున రాజనామ కీర్తనము అను నూట ఎనుబది అయిదవ అధ్యాయము. (185)