28. ఇరువది ఎనిమిదవ అధ్యాయము
సంజయునికి యుధిష్ఠిరుడు సమాధానమిచ్చుట.
యుధిష్ఠిర ఉవాచ
అసంశయం సంజయ సత్యమేతద్
ధర్మో వరః కర్మణాం యత్ త్వమాత్థ।
జ్ఞాత్వా తు మాం సంజయ గర్హయేస్త్వం
యది ధర్మం యద్యధర్మం చరేయమ్॥ 1
యుధిష్ఠిరుడు పలికాడు. సంజయా! సందేహం లేదు. కర్మలలో ధర్మం శ్రేష్ఠమైనదనుట సత్యము. నేను ధర్మంగా నడుస్తున్నానో అధర్మంగా నడుస్తున్నానో బాగా తెలిసికొని నన్ను నిందించు. (1)
యత్రాధర్మో ధర్మరూపాణి ధత్తే
ధర్మః కృత్స్నో దృశ్యతే ఽధర్మరూపః।
బిభ్రద్ ధర్మో ధర్మరూపం తథా చ
విద్వాంసస్తం సంప్రపశ్యంతి బుద్ధ్యా॥ 2
ఒక్కొక్క చోట అధర్మం ధర్మరూపంలో కనబడుతుంది. మరొక చోట ధర్మం అధర్మంగా కనబడుతుంది. ఇంకొకచోట ధర్మం తన సహజమైన ధర్మరూపాన్నే ధరిస్తుంది. విద్వాంసులు తమ బుద్ధిచేత దాని అసలు రూపాన్ని చూడ గల్గుతారు.(2)
ఏవం తథైవాపది లింగమేతద్
ధర్మాధర్మౌ నిత్యవృత్తీ భజేతామ్।
ఆద్యం లింగం యస్య తస్య ప్రమాణమ్
ఆపద్ధర్మం సంజయ తం నిబోధ॥ 3
ధర్మాధర్మాలు నిశ్చయరూపంలో ఉండేవైనా ఆపత్కాలంలో భిన్నలక్షణాన్ని పొందుతాయి. ఏ వర్ణానికి మొదట ఏ లక్షణం (ధర్మం) చెప్పబడిందో దాని కదే ప్రమాణం. కాని ఆపద్ధర్మం యొక్క స్వభావం వేరే ఉంటుంది. ముందు దాన్ని బాగా తెలిసికో. (3)
లుప్తాయాం తు ప్రకృతౌ యేన కర్మ
నిష్పాదయేత్ తత్ పరీప్సేద్ విహీనః।
ప్రకృతిస్థశ్చాపది వర్తమానః
ఉభౌ గర్హ్యౌ భవతః సంజయేతౌ॥ 4
స్వాభావిక జీవనంలో ఉండి తనకర్మ తాను చేయలేని వాడు సత్కార్మాచరణం కోసం వేరేవృత్తిని ఆశ్రయించకపోయినా, స్వాభావిక జీవనంలో జివిక కలిగినవాడు కూడా ఆపద్ధర్మాన్ని స్వీకరించినా వారిద్దరూ కూడ నిందింపదగినవారే ఔతారు. (4)
అవినాశమిచ్ఛతాం బ్రాహ్మణానాం
ప్రాయశ్చిత్తం విహితం యద్ విధాత్రా।
సంపశ్యథాః కర్మసు వర్తమానాన్
వికర్మస్థాన్ సంజయ గర్హయేస్త్వమ్॥ 5
సూతుడా! అందుకే బ్రాహ్మణుల వినాశం కాకూడదనే బ్రాహ్మ వారికి ప్రాయశ్చిత్తాన్ని విధించాడు. ఆపత్తికాలంలో కూడ మా విహిత కర్మలలో మేమున్నామా లేక ఆపత్కాలం కాకుండానే ఇతరుల విహితకర్మను స్వీకరిస్తున్నామా అనేది బాగా గమనించి మమ్మల్ని నిందించు. (5)
మనీషిణాం సత్త్వవిచ్ఛేదనాయ
విధీయతే సత్సు వృత్తిః సదైవ।
అబ్రాహ్మణాః సంతి తు యే న వైద్యాHఆ
సర్వోత్సంగం సాధు మన్యేత తేభ్యః॥ 6
బుద్ధిమంతులైనవారు భవబంధాలను ఛేదించడానికి సత్పురుషులనాశ్రయించి జీవితాన్ని నిర్వహించుకోవడం శాస్త్రీయ విధానం. బ్రహ్మవిద్యపట్ల నిష్ఠలేనివారు అబ్రాహ్మణులు. వారు మాత్రం వారి వారి వర్ణాశ్రమ ధర్మాలను అనుసరించి జీవనం సాగించాలి. (6)
తదధ్వానః పితరో యే చ పూర్వే
పితామహా యే చ తేభ్యః పరేఽన్యే।
యజ్ఞైషితో యే చ హి కర్మ కుర్యుః
నాన్యం తతో నాస్తికోఽస్మీతి మన్యే॥ 7
పూర్వీకులైన నా తండ్రులు, తాతలు, ముత్తాతలు అంతకంటె ముందువారు యజ్ఞేచ్ఛతో కర్మ చేశారు. ఆ మార్గంలోనే నేనూ నడుస్తాను. మరో మార్గంలో వెళ్లడానికి నేనేమీ నాస్తికుణ్ణి కాదు.
యత్ కించనేదం విత్తమస్యాం పృథివ్యాం
యద్ దేవానాం త్రిదశానాం పరం యత్।
ప్రాజాపత్యం త్రిదివం బ్రహ్మలోకం
నాధర్మతః సంజయ కామయేయమ్॥ 8
సంజయా! ఈ భూమండలం మీదున్న సమస్తధనవైభవం కలిగినా, త్రిదశులు, నిత్యయౌవనులూ ఐన దేవతల యొక్క సంపత్తి లభించినా, దానికంటె గొప్పదైన ప్రజాపతివైభవం లభించినా, దానికంటె గొప్పదైన బ్రహ్మలోకవైభవం లభించినా సరే, నేను అధర్మాన్ని స్వీకరించను. (8)
ధర్మేశ్వరః కుశలో నీతిమాంశ్చా
ప్యుపాసితా బ్రాహ్మణానాం మనీషీ।
నానావిధాంశ్చైవ మహాబలాంశ్చ
రాజన్యభోజాననుశాస్తి కృష్ణః॥ 9
యది హ్యహం విసృజన్ సామ గర్హ్యః
నియుధ్యమానో యది జహ్యాం స్వధర్మమ్।
మహాయశాః కేశవస్తద్ బ్రవీతు
వాసుదేవస్తూభయోరర్థకామః॥ 10
ఇక్కడ ధర్మానికి అధినాయకుడు, నీతిజ్ఞుడు, కుశలుడు, బ్రాహ్మణ భక్తుడు, మనీషి, నానావిధ బలశాలులైన క్షత్రియులను, భోజవంశీయులను శాసింపగల వాడు అయిన కృష్ణుడున్నాడు. నేను సామమార్గాన్ని విడిచిపెట్టి నిందింపదగిన వాణ్ణి అవుతున్నానా, లేక యుద్ధానికి ప్రయత్నించి ధర్మోల్లంఘన చేస్తున్నానా అనే విషయాన్ని మహాయశస్వి ఐన వసుదేవనందనుడే చెప్పగలడు. అతడు రెండు పక్షాల హితాన్ని కోరేవాడు కదా! (9,10)
శైనేయోఽయం చేదయశ్చాంధకాశ్చ
వార్ష్ణేయభోజాః కుకురాః సృంజయాశ్చ।
ఉపాసీనా వాసుదేవస్య బుద్ధిం
నిగృహ్య శత్రూన్ సుహృదో నందయంతి॥ 11
సాత్యకి, చేది రాజులు, అంధక, వృష్ణి, భోజ, కుకుర, సృంజయ వంశ రాజులు, శ్రీకృష్ణభగవానుని అభిప్రాయాన్ని ఆదరించి, వారి శత్రువులను అణచి, స్నేహితులకు ఆనందాన్ని కలిగిస్తారు. (11)
వృష్ణ్యంధకా హ్యుగ్రసేనాదయో వై
కృష్ణప్రణీతాః సర్వ ఏవేంద్రకల్పాః।
మనస్వినః సత్యపరాయణాశ్చ
మహాబలా యాదనా భోగవంతః॥ 12
శ్రీకృణుడు చెప్పే నీతిని అనుసరించడం వల్లే వృష్ణి, అంధక వంశీయులైన ఉగ్రసేనాది క్షత్రియులు ఇంద్రునితో సమానమైన శక్తిగల వారయ్యారు. యాదవులంతా దయగలవారు. సత్యపరాయణులు, గొప్పబలవంతులు, భోగసంపత్తి గల వారయ్యారు. (12)
కాశ్యో బభ్రుః శ్రియముత్తమాం గతః
లబ్ధ్వా కృష్ణం భ్రాతరమీశితారమ్।
యస్మై కామాన్ వర్షతి వాసుదేవః
గ్రీష్మాత్యయే మేఘ ఇవ ప్రజాభ్యః॥ 13
కాశీరాజైన బభ్రువు శ్రీకృష్ణుని సోదరునిగా చేసికొని, ఉత్తమ రాజ్య సంపదను పొందాడు. వర్షాకాలంలో జనులకోసం మేఘం వర్షించినట్లుగా, శ్రీకృష్ణుడు బభ్రువు కోసం కోరిన కోరికలిస్తున్నాడు. (13)
ఈదృశోఽయం కేశవస్తాత విద్వాన్
విద్ధి హ్యేనం కర్మణాం నిశ్చయజ్ఞమ్।
ప్రియశ్చ నః సాధుతమశ్చ కృష్ణః
నాతిక్రామే వచనం కేశవస్య॥ 14
నాయనా సంజయా! శ్రీకృష్ణుడు ఇంతటి ప్రభావం కల విద్వాంసుడని తెలుసుకో. అతడు కర్మాచరణం యొక్క నిశ్చయాన్ని ఎరిగినవాడు. ఇతడు మా అందరికి మిక్కిలి ప్రీతి పాత్రుడు, శ్రేష్ఠుడు కూడ. ఇతని ఆజ్ఞను నేను ఉల్లంఘింపలేను. (14)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి సంజయయాన పర్వణి యుధిష్ఠిరవాక్యే అష్టావింశోఽధ్యాయః॥ 28 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున సంజయ యాన పర్వమను ఉపపర్వమున యుధిష్ఠిరవాక్యమను ఇరువది ఎనిమిదవ అధ్యాయము. (28)