4. నాలుగవ అధ్యాయము

ధౌమ్యుని ఉపదేశము.

యుధిష్ఠిర ఉవాచ
కర్మాణ్యుక్తాని యుష్మాభిః యాని యాని కరిష్యథ।
మమ చాపి యథాబుద్ధిః ఉచితా విధినిశ్చయాత్॥ 1
ధర్మరాజు ఇలా అన్నాడు. విరాటనగరంలో మీరు చేయదలచిఅ పనులు మీరు చెప్పారు. విధినిశ్చయం వల్ల నాకు తోచినవి నేను చెప్పాను. (1)
పురోహితోఽయమస్మాకమ్ అగ్నిహోత్రాణి రక్షతు।
సూదపౌరోగవైః సార్ధం ద్రుపదస్య నివేశనే॥ 2
ఇంద్రసేనముఖాశ్చేమే రథానాదాయ కేవలాన్।
యాంతు ద్వారవతీం శీఘ్రమ్ ఇతి మే వర్తతే మతిః॥ 3
"మనపురోహితులయిన ధౌమ్యులవారు సూద పౌరోగవులతో సహా ద్రుపదుని యింట్లో అగ్నిహోత్రాలను రక్షించాలి. ఇంద్రసేనాది సేవకులు కేవలం రథాలతో త్వరగా ద్వారకకు వెళ్లాలి". అని నాకు అనిపిస్తోంది. (2,3)
వి॥ సం॥ అగ్నిహోత్రాణి = అరణితో సహా అగ్నిహోత్రసాధనాలైన పాత్రలు, హోమసాధకాలైన ధేనువులు. (నీల)
వి॥తె॥ ధౌమ్యుడు ద్రుపదుని యింట్లో కాకుండా ఒకముని ఆశ్రమానికి వెళ్లినట్లు తిక్కన మార్చారు.
ఇమాశ్చ నార్యో ద్రౌపద్యాః సర్వాశ్చ పరిచారికాః।
పాంచాలానేవ గచ్ఛంతు సూదపౌరోగవైః సహ॥ 4
ఈ ద్రౌపదీ పరిచారికలంతా, మన వంటవారూ అధ్యక్షులతో సహా పాంచాలదేశానికే వెళ్లాలి. (4)
సర్వైరపి చ వక్తవ్యం న ప్రాజ్ఞాయంత పాండవాః।
గతా హ్యస్మానపాహాయ సర్వే ద్వైతవనాదితి॥ 5
"పాండవు లేమయ్యారో తెలియదు. మమ్మల్ని ద్వైతవనంలో విడిచి వెళ్లి పోయారు" అని వీరంతా చెప్పాలి. (5)
వైశంపాయన ఉవాచ
ఏవం తేఽన్యోన్యమామంత్ర్య కర్మాణ్యుక్త్వా పృథక్ పృథక్।
ధౌమ్యమామంత్రయామాసుః స చ తాన్మంత్రమబ్రవీత్॥ 6
వైశంపాయను డిలా అన్నాడు. జనమేజయా! ఇలా పాండవులు తమ పనులు చెప్పికొని పరస్పరం వీడ్కోలు చెప్పుకొన్నారు. తరువాత పాండవులు ధౌమ్యునికి 'వెళ్లి వస్తా'మని చెప్పారు. అపుడు ధౌమ్యుడు పాండవులతో ఇలా అన్నాడు. (6)
ధౌమ్య ఉవాచ
విహితం పాండవాః సర్వం బ్రాహ్మణేషు సుహృత్సు చ।
యానే ప్రహరణే చైవ తథైవాగ్నిషు భారత॥ 7
త్వయా రక్షా విధాతవ్యా కృష్ణాయాః ఫాల్గునేన చ।
విదితం వో యథా సర్వం లోకవృత్తమిదం తవ॥ 8
ధౌమ్యుడిలా అన్నాడు. పాంఢవులారా! బ్రాహ్మణులందు, స్నేహితులందు, విజయయాత్రలో, యుద్ధంలో, అగ్నుల విషయంలో శాస్త్రంలో చెప్పబడిన దంతా మీకు తెలుసును. రాజా! నీవూ, అర్జునుడూ కూడా ద్రౌపదికి రక్షణ కలిస్తూ ఉండాలి. ఇది లోకమర్యాద అని మీకూ తెలుసు. (7,8)
వి॥ సం॥ స్త్రీలకు తగిన రక్షణ లేకపోయినచో వారు సాధ్వులయినా సరే వారిని గురించి అన్యాయంగా మాటాడటం లోకస్వభావం. అది బాగా తెలిసినవాడవు కాబట్టి ద్రౌపదిని జాగరూకతతో కాపాడవలసినదని యుధిష్ఠిరునకు ధౌమ్యుని హితవచనం. (నీల)
భీమాదులు లోకవృత్తాంతం బాగా తెలిసినవారు కాబట్టి విరాటుని దగ్గర వారి ఉనికిని గురించి చింత అవసరం లేదు. కానీ స్త్రీ అయిన ద్రౌపది విషయంలోనే విశేషరక్షణ అవసరం. ఆ సందర్భంగా సర్వరక్షాధికారియై విశేషించి క్లీబరూపంగల అర్జునుడు ఎక్కువ బాధ్యత వహించాలి. (అర్జు)
విదితే చాపి వక్తవ్యం సుహృద్భిరనురాగతః।
ఏష ధర్మశ్చ కామశ్చ అర్థశ్చైవ సనాతనః॥ 9
మీకు తెలిసినా హితం కోరే స్నేహితులు ప్రేమతో చెప్పాలి. ఇది సనాతన మైన ధర్మము, అర్థము, కామము కూడ. (సనాతన వర్గత్రయం సమకూరుతుంది) (9)
అతోఽహ మపి వక్ష్యామి హేతుమిత్ర నిబోధత।
హంతేమాం రాజవసతిం రాజపుత్రా బ్రవీమ్యహమ్॥ 10
యథా రాజకులం ప్రాప్య సర్వాన్ దోషాం స్తరిష్యథ।
దుర్వసం చైవ కౌరవ్య జానతా రాజవేశ్మని॥ 11
అందుచేత నేను కూడ చెపుతున్నాను. దీనిలోని ఆంతర్యం తెలుసుకోండి. రాజపుత్రులారా! మీరు రాజ మందిరంలో నివసించవలసిన తీరును గురించి చెపుతాను. రాజగృహంలో సంచరించడం కష్టమని ముందుగా తెలిస్తే రాజకులంలో ప్రవేశించాక సర్వదోషాలనూ తరిస్తారు. (10,11)
అమానితైర్మానితైర్వా అజ్ఞాతైః పరివత్సరమ్।
తతశ్చతుర్దశే వర్షే చరిష్యథ యథాసుఖమ్॥ 12
అగౌరవం జరిగినా, గౌరవం జరిగినా, అజ్ఞాతంగా ఈ సంవత్సరం అంతా గడిపి తరువాత పదునాలుగో సంవత్సరంలో సుఖంగా జీవించండి. (12)
దృష్టద్వారో లభేత ద్రష్టుం రాజస్వేషు న విశ్వసేత్।
తదేవాసన మన్విచ్ఛేత్ యత్ర నాభిపతేత్ పరః॥ 13
రాజుగారిని చూడటానికి ముందు ద్వారపాలకుని అనుమతి పొందాలి. రాజసంపదలమీద మక్కువ పడ రాదు. ఇతరులు ఆసించని ఆసనాన్నే కోరుకోవాలి. (13)
వి॥ సం॥ తమ పుత్రులనుకూడా విశ్వసించని రాజులు మంత్రవిప్లవ భయంతో వెంటనే స్పందించి శిక్షిస్తారు. కాబట్టి రాజునకు ఎంతనచ్చినా అనుమతి లేకుండా దర్శనం చేయకూడదు. (నీల)
ఇతరులు తమదంటూ పోటీపడి కోపం చూపించడానికి వీలులేని రాజమర్యాదలమీదనే దృష్టి ఉండాలి కాని దేనిని తనదిగా పూర్తిగా నమ్మి ప్రవర్తింపరాదు. (విష)
యో న యానం న పర్యంకం న పీఠం న గజం న రథమ్।
ఆరోహేత్ సమ్మతో ఽస్మీతి స రాజవసతిం వసేత్॥ 14
నేను రాజుకు ఇష్టుడన్ కదా అని రాజుగారి వాహనం కాని, శయ్యగాని, పీఠంగాని, ఏనుగునుకాని, రథాన్నికాని, అధిరోహింపరాదు. అలా ఉన్న నిపుణుడే రాజు దగ్గర నివసింప గలుగుతాడు. (14)
యత్ర యత్రైనమాసీనం శంకేరన్ దుష్టచారిణః।
న తత్రోపవిశేత్ యో వై స రాజవసతిం వసేత్॥ 15
ఎక్కడ కూర్చుంటే దుష్టులు అనుమానిస్తారో అక్కడ నేర్పరి కూర్చుండరాదు. అటువంటి వాడే రాజభవనంలో నివసింపగలడు. (15)
వి॥సం॥ ద్యూతగృహాలు, మద్యపాన వేశ్యాగృహాలు, తన నగరంలోనే పరదేశస్థులు సంచరించే తావులు మొదలైన వాటిలో సంచరిస్తే వాని శీలం శంకింపబడుతుంది. కాబట్టి అటువంటి తావులలో సంచరింపరాదు. (నీల)
ఖజానా, అంతఃపురం మొదలైనవాటికి దగ్గరగా తిరగడం అనుమానాస్పద మవుతుంది. (అర్జు-విష)
న చామశిష్యాత్ రాజానమ్ అపృచ్ఛంతం కదాచన।
తూష్ణీం త్వేనముపాసీత్ కాలే సమభిపూజయేత్॥ 16
రాజు అడగకుండా ఎప్పుడూ రాజుకు (కర్తవ్యం) బోధించకూడదు. ఊరకే రాజును(మౌనంగా) సేవించాలి. సమయం తెలిసికొని ప్రశంసించాలి. (16)
అసూయంతి హి రాజానః జనాననృతవాదినః।
తథైవ చావమన్యంతే మంత్రిణం వాదినం మృషా॥ 17
అసత్యం పలికే వారిని రాజులు దోషులుగా చూస్తారు. వాడు మంత్రి అయినా సరే అవమానిస్తారు. (17)
నైషాం దారేషు కుర్వీత మైత్రీం ప్రాజ్ఞః కదాచన।
అంతఃపురచరా యే చ ద్వేష్టి యానహితాశ్చా యే॥ 18
రాజుగారి భార్యలతో ఎన్నడూ సాంగత్యం చేయరాదు. అలా అంతఃపురంలో తిరిగే వారితోను, రాజుగారు ద్వేషించే వారితోనూ, రాజశత్రువులతోనూ మైత్రి చేయరాదు. (18)
వి॥తె॥ అంతఃపురంలో తిరిగే కుబ్జ వామన కాంతాదులతోడి పొత్తు అంతకంటె కీడు అని తిక్కన. (4-1-131)
విదితే చాస్య కుర్వీత కార్యాణి సులఘాన్యపి।
ఏవం విచరతో రాజ్ఞి న క్షతిర్జాయతే క్వచిత్॥ 19
చిన్న పనులయినా రాజుకు చెప్పిన తరువాతనే చెయ్యాలి. ఇలా రాజభవనంలో చరించేవానికి ఎప్పుడూ హాని కలుగదు. (19)
గచ్ఛన్నపి పరాం భూమిమ్ అపృష్టో హ్యనియోజితః।
జాత్యంధ ఇవ మన్యేత మర్యాదామనుచింతయన్॥ 20
కూర్చోటానికి ఉత్తమాసనం లభించినా రాజు ఆజ్ఞాపించనంతవరకూ రాజమర్యాదను భావిస్తూ పుట్టు గ్రుడ్డివానివలె నిలవాలి. రాజాజ్ఞకై ఎదురు చూడాలి. (20)
న హి పుత్రం న నప్తారాం న భ్రాతరమరిందమాః।
సమతిక్రాంతమర్యాదం పూజయంతి నరాధిపాః॥ 21
మర్యాద మీరి ప్రవర్తించేవారు పుత్రులయినా, మునిమనుమలయినా, సోదరులయినా సరే శత్రుసంహారకు లయిన రాజులు గౌరవించరు. (21)
వి॥ తమ అలుకకు పాత్రము చేయుదురని తిక్కన వ్యాఖ్య. (4-1-124)
యత్నాచ్చోపచరేదేనమ్ అగ్నివత్ దేవవత్ త్విహ।
అనృతేనోపచీర్ణో హి హన్యాదేవ న సంశయః॥ 22
రాజును అగ్నివలె, దేవుని వలె శ్రద్ధతో సేవించాలి. (అగ్నిని మరీ దగ్గర కాకుండ సేవించాలి. అలాగే రాజునూ) (దేవుడు నిగ్రహానుగ్రహ సమర్థుడు. అందుచేత రాజునూ ఆదృష్టితోనే సేవించాలి) ఈసేవలో ఏమాత్రం కల్మషమూ, కపటమూ ఉన్నా రాజు అతనిని చంపితీరుతాడు. ఇందులో సందేహం లేదు. (22)
వి॥ సం॥ అత్యాసత్తి రనర్థాయ దూరాసత్తిశ్చ నిష్ఫలా।
సేవ్యంతే మధ్యభావేన రాజ వహ్ని గురుస్త్రియః॥
(రాజు, అగ్ని, గురుపత్నులతో మిక్కిలి దగ్గరగా మెలగటం అనర్థకారణం. మరీదూరంగా నిలవటం నిరుపయోగకరం. కాబట్టి వారితో సాహచర్యంతో తటస్థ స్థితిని/మధ్యస్థితిని పాటించాలి.) దేవతవలె సేవించాలనటంలో పరోక్షంలో కూడా భయభక్తులు కలిగి ఉండాలని భావం. (అర్జు)
యద్యద్భర్తానుయుంజీత తత్ తదేవానువర్తయేత్।
ప్రమాద మవలేపం చ కోపం చ పరివర్జయేత్॥ 23
రాజు నియోగించిన పనినే సేవకుడు చెయ్యాలి. ఆ సేవలో ఏమరుపాటు, గర్వం, కోపం ఏమాత్రం ఉండరాదు. (23)
సమర్థనాసు సర్వాసు హితం చ ప్రియమేవ చ।
సంవర్ణయేత్ తదేవాస్య ప్రియాదపి హితం వదేత్॥ 24
'ఇది కార్యం , ఇది అకార్యం.' అని నిశ్చయింప వలసి వచ్చినపుడు సేవకుడు రాజుకు హితం, ప్రియం అయినదే చెప్పాలి. రెండూ కలిపి(హితం, ప్రియం) కుదరక పోతే ప్రియాన్ని విడిచి హితమే చెప్పాలి. (24)
వి॥సం॥ చివరకు సుఖం కలిగించేది హితం, వినగానే సుఖం కలిగించేది ప్రియం. (నీల)
అనుకూలో భవేచ్చాస్య సర్వార్థేషు కథాసు చ।
అప్రియం చాహితం యత్స్యాత్ తదస్మై నామవర్తయేత్॥ 25
రాజుకు సేవకుడు అన్ని విషయాల్లోనూ సామాన్య సంభాషణలో కూడా అనుకూలంగానే చెప్పాలి. అప్రియమైనా, అహితమైనా రాజుకు చెప్పరాదు. (25)
వి॥ అనుకూల మనగా రాజు మనసుకు అనుకూలంగా.
నాహమస్య ప్రియోఽస్మీతి మత్వా సేవేత పండితః।
అప్రమత్తశ్చ సతతం హితం కుర్యాత్ ప్రియం చ యత్॥ 26
"నేను రాజుకు హితుడనే" అనుకొని పండితుడు స్వేచ్ఛగా ప్రవర్తింపరాదు. ఎల్లపుడూ యత్నపరుడై రాజుకు హితమూ, ప్రియమూ అయిన కార్యాలనే చేయాలి. (26)
నాస్యానిష్టాని సేవేత నాహితైః సహ సంవదేత్।
స్వస్థానాన్నవికంపేత స రాజవసతిం వసేత్॥ 27
రాజుకు ఇష్టం కాని పనులు చేయరాదు. రాజశత్రువులతో మాట్లాడరాదు. రాజు నిర్దేశించిన కార్యం నుండి చలింపరాదు. అట్టి నేర్పరి రాజసభలో రాణిస్తాడు. (27)
దక్షిణం వాథ వామం వా పార్శ్వమాసీత పండితః।
రక్షిణాం హ్యాత్తశస్త్రాణాం స్థానం పశ్చాద్ విధీయతే॥ 28
తెలివిగల పండితుడు రాజుకు కుడిప్రక్కనుగాని, ఎడమప్రక్కనుగాని కూర్చోవాలి. వెనుకభాగంలో ఆయుధాలు ధరించిన రక్షకులుంటారు. (అందుచేత వెనుక భాగం పనికిరాదు) (28)
నిత్యం హి ప్రతిషిద్ధం తు పురస్తాదాసనం మహత్।
న చ సందర్శనే కించిత్ ప్రవృత్తమపి సంజయేత్॥ 29
రాజు ఎదుట పెద్ద ఆసనం మీద సేవకుడు ఎప్పుడూ కూర్చుండరాదు. రాజు చూస్తూ ఉండగా సేవకుడు ఏ చిన్న పురస్కారమూ స్వీకరింపరాదు. (29)
అపి హ్యేతద్ దరిద్రాణాం వ్యలీకస్థానముత్తమమ్।
న మృషాభిహితం రాజ్ఞాం మనుష్యేషు ప్రకాశయేత్॥ 30
రాజుయొక్క అసత్యభాషణాన్ని ఎక్కడా బయట పెట్టరాదు. ఈ తీరు దరిద్రులకు కూడా అప్రియం కలిగిస్తుంది. రాజు విషయంలో ఇంక వేరుగా చెప్పాలా? (30)
వి॥సం॥ రాజు తప్పుచేసినా, ఆ విషయం తనకు స్పష్టంగా తెలిసినా దృఢంగా మనస్సులో నిలిచి ఉన్నా పరోక్షంలో దానిని గురించి మాటాడరాదు. (విష)
అసూయంతి హి రాజానః నరాననృతవాదినః।
తథైవ చావమన్యంతే నరాన్ పండితమానినః॥ 31
తమ అబద్ధాలు బయటపెట్టేవారిని రాజులు దూషిస్తారు. పండితుల మనుకొనే వారిని కూడా అలాగే అవమానిస్తారు. (31)
శూరోఽస్మీతి న దృప్తః స్యాద బుద్ధిమానితి వా పునః।
ప్రియమేవాచరన్ రాజ్ఞః ప్రియో భవతి భోగవాన్॥ 32
నేను శూరుడను అని గర్వపడరాదు. బుద్ధి మంతుడననీ (తెలివిగలవాడననీ) విఱ్ఱవీగరాదు. రాజుకు ప్రియమాచరించి అతనికి ఇష్టుడు కావాలి. అపుడే భోగశాలి అవుతాడు. (32)
ఐశ్వర్యం ప్రాప్య దుష్ప్రాపం ప్రియం ప్రాప్య చ రాజతః।
అప్రమత్తో భవేత్ రాజ్ఞః ప్రియేషు చ హితేషు చ॥ 33
ఒకసారి రాజుగారి అనుగ్రహంవల్ల పొందలేని(అంతులేని) ఐశ్వర్యం పొందితే ఆ తరువాత రాజుగారి ప్రియ హితాల పట్ల అప్రమత్తుడై ఉండాలి. (33)
యస్య కోపో మహాబాధః ప్రసాదశ్చ మహాఫలః।
కస్తస్య మనసాపీచ్ఛేత్ అనర్థం ప్రాజ్ఞసమ్మతః॥ 34
ఎవని కోపం చాలా కష్టం కలిగిస్తుందో, ఎవని అనుగ్రహం మహాఫలితాన్నిస్తుందో వానికి ఎంత తెలివిగలవాడైనా మనసులో కూడా కీడు తలవకూడదు. (34)
న చోష్ఠౌ న భుజౌ జానూ న చ వాక్యం సమాక్షిపేత్।
సదా వాతం చ వాచం చ ష్ఠీవనం చాచరేచ్ఛనైః॥ 35
రాజు దగ్గర పెదవులు కొరకరాదు. చేతులు చాచరాదు. మోకాళ్లు చాచుకొని కూర్చోరాదు. సాగదీసి మాట్లాడరాదు. ఆవులింత/అపానవాయు విసర్జనంగాని, మాటలుగాని, నిష్ఠీవనంగాని (ఉమ్మివేయడం) ఇతరులకు తెలియకుండా మెల్లగా చెయ్యాలి. (35)
వి॥సం॥ సదావాతమంటే ఊపిరి అని వ్యాఖ్యాత. (విరో)
హాస్యవస్తుషు చాన్యస్య వర్తమానేషు కేషుచిత్।
నాతిగాఢం ప్రహృష్యేత న చాప్యున్మత్తవద్ధసేత్॥ 36
న చాతిధైర్యేణ చరేద్ గురుతాం హి వ్రజేత్ తతః।
స్మితం తు మృదుపూర్వేణ దర్శయేత ప్రసాదజమ్॥ 37
ఇతరసేవకు లెవరయినా నవ్వులపాలవు తున్నపుడు ఎక్కువ సంతోష పడరాదు. పిచ్చి వానివలె నవ్వరాదు. అతిధైర్యంతో ప్రవర్తింపరాదు. అలా ఉంటేనే గౌరవం పొందుతాడు. సంతోషాన్నికూడ మృదువైన చిరునవ్వుతో ప్రదర్శించాలి. (36,37)
లభే న హర్షయేద్ యస్తు నవ్యథేద్ యోఽవమానితః।
అసమ్మూఢశ్చ యో నిత్యం స రాజవసతిం వసేత్॥ 38
లాభం కలిగితే పొంగిపోకుండా, అవమానం కలిగితే కుంగిపోకుండా నిత్యమూ ఏకాగ్రతతో(రాజసేవలో) ఉండేవాడు రాజసభలో చిరకాలం ఉంటాడు. (38)
రాజానం రాజపుత్రం వా సంవర్ణయతి యః సదా।
అమాత్యః పండితో భూత్వా స చిరం తిష్ఠతే ప్రియః॥ 39
రాజును కాని, రాజకుమారుని కాని సదా ప్రశంసించే వాడు మంత్రియో, ఆస్థానపండితుడో అయి రాజుకు ప్రియుడై చిరకాలం రాజసభలో మనగలుగుతాడు. (39)
ప్రగృహీతశ్చ యోఽమాత్యః నిగృహీతస్త్వకారణైః।
న నిర్వదతి రాజానం లభతే సంపదం పునః॥ 40
ప్రత్యక్షం చ పరోక్షం చ గుణవాదీ విచక్షణః।
ఉపజీవీ భవేద్ రాజ్ఞః విషయే యోఽపి వా భవేత్॥ 41
మొదట రాజుచే స్వీకరింపబడిన మంత్రి అకారణం గానే బహిష్కరింపబడినా, కారాగారమం దుంచబడినా ఆ మంత్రి రాజును ద్వేషింపనిచో, నిందింపనిచో మళ్లీ సంపదను పొందుతాడు. రాజుయొక్క రాజ్యమందు కానీ, కొలువులోకానీ ఉన్న నేర్పరి ప్రత్యక్షంగాకాని, పరోక్షంగాకాణి రాజుగుణాలనే చెప్పాలి. (దోషాలు చెప్పరాదు) (40,41)
అమాత్యో హి బలాద్ భోక్తుం రాజానం ప్రార్థయేత యః।
న స తిష్ఠేచ్చిరం స్థానం గచ్ఛేచ్చ ప్రాణసంశయమ్॥ 42
రాజును బలవంతంగా లొంగదీసుకోవాలనుకొనే మంత్రి ఎంతో కాలం ఆ పదవిలో నిలవడు. అతని ప్రాణాలకు కూడ ముప్పు కలుగుతుంది. (42)
వి॥ సం॥ ఇచట భోక్తుం అనగా కుటిలముగా చేయుట అని అర్థము. 'భుజ కౌటిల్యే' అని ధాతువు. (నీల)
శ్రేయః సదాఽత్మనో దృష్ట్వా పరం రాజ్ఞా న సంవదేత్।
విశేషయేచ్చ రాజానం యోగ్యభూమిషు సర్వదా॥ 43
ఎప్పుడైనా తన శ్రేయస్సుకు భంగం కలిగే పక్షంలో రాజుతో ఇతరులను కలవనీయరాదు. సంవాదం చేయనీయరాదు. యోగ్యవిషయాల్లో/స్థలాల్లో రాజుకు తన చాతుర్యాన్ని చూపాలి. (43)
అమ్లానో బలవాన్ శూరః ఛాయేవానుగతః సదా।
సత్యవాదీ మృదుర్దాంతః స రాజవసతిం వసేత్॥ 44
వి॥సం॥ రాజు తప్పుచేసినా, ఆ విషయం తనకు స్పష్టంగా తెలిసినా దృఢంగా మనస్సులో నిలిచి ఉన్నా పరోక్షంలో దానిని గురించి మాటాడరాదు. (విష)
అసూయంతి హి రాజానః నరాననృతవాదినః।
తథైవ చావమన్యంతే నరాన్ పండితమానినః॥ 31
తమ అబద్ధాలు బయటపెట్టేవారిని రాజులు దూషిస్తారు. పండితుల మనుకొనే వారిని కూడా అలాగే అవమానిస్తారు. (31)
శూరోఽస్మీతి న దృప్తః స్యాద్ బుద్ధిమానితి వా పునః।
ప్రియమేవాచరన్ రాజ్ఞః ప్రియో భవతి భోగవాన్॥ 32
నేను శూరుడను అని గర్వపడరాదు. బుద్ధి మంతుడననీ (తెలివిగలవాడననీ) విఱ్ఱవీగరాదు. రాజుకు ప్రియమాచరించి అతనికి ఇష్టుడు కావాలి. అపుడే భోగశాలి అవుతాడు. (32)
ఐశ్వర్యం ప్రాప్య దుష్ప్రాపం ప్రియం ప్రాప్య చ రాజతః।
అప్రమత్తో భవేత్ రాజ్ఞః ప్రియేషు చ హితేషు చ॥ 33
ఒకసారి రాజుగారి అనుగ్రహంవల్ల పొందలేని(అంతులేని) ఐశ్వర్యం పొందితే ఆ తరువాత రాజుగారి ప్రియ హితాల పట్ల అప్రమత్తుడై ఉండాలి. (33)
యస్య కోపో మహాబాధః ప్రసాదశ్చ మహాఫలః।
కస్తస్య మనసాపీచ్ఛేత్ అనర్థం ప్రాజ్ఞసమ్మతః॥ 34
ఎవని కోసం చాలా కష్టం కలిగిస్తుందో, ఎవని అనుగ్రహం మహాఫలితాన్నిస్తుందో వానికి ఎంత తెలివిగలవాడైనా మనసులో కూడా కీడు తలపకూడదు. (34)
న చోష్ఠౌ న భుజౌ జానూ న చ వాక్యం సమాక్షిపేత్।
సదా వాతం చ వాచం చ ష్ఠీవనం చాచరేచ్ఛనైః॥ 35
రాజు దగ్గర పెదవులు కొరకరాదు. చేతులు చాచరాదు. మోకాళ్లు చాచుకొని కూర్చోరాదు. సాగదీసి మాట్లాడరాదు. ఆవులింత/అపానవాయు విసర్జనంగాని, మాటలుగాని, నిష్ఠీవనంగాని(ఉమ్మివేయడం) ఇతరులకు తెలియకుండా మెల్లగా చెయ్యాలి. (35)
వి॥సం॥ సదావాతమంటే ఊపిరి అని వ్యాఖ్యాత. (విరో)
హాస్యవస్తుషు చాన్యస్య వర్తమానేషు కేషుచిత్।
నాతిగాఢం ప్రహృష్యేత న చాప్యున్మత్తవద్ధసేత్॥ 36
న చాతిధైర్యేణ చరేద్ గురుతాం హి వ్రజేత్ తతః।
స్మితం తు మృదుపూర్వేణ దర్శయేత ప్రసాదజమ్॥ 37
ఇతరసేవకు లెవరయినా నవ్వులపాలవు తున్నపుడు ఎక్కుడ సంతోష పడరాదు. పిచ్చి వానివలె నవ్వరాదు. అతిధైర్యంతో ప్రవర్తింపరాదు. అలా ఉంటేనే
గౌరవం పొందుతాడు. సంతోషాన్నికూడ మృదువైన చిరునవ్వుతో ప్రదర్శించాలి. (36,37)
లాభే న హర్షయేద్ యస్తు నవ్యథేద్ యోఽవమానితః।
అసమ్మూఢశ్చ యో నిత్యం స రాజవసతిం వసేత్॥ 38
లాభం కలిగితే పొంగిపోకుండా, అవమానం కలిగితే కుంగిపోకుండా నిత్యమూ ఏకాగ్రతతో(రాజసేవలో) ఉండేవాడు రాజసభలో చిరకాలం ఉంటాడు. (38)
రాజానం రాజపుత్రం వా సంవర్ణయతి యః సదా।
అమాత్యః పండితో భూత్వా స చిరం తిష్ఠతే ప్రియః॥ 39
రాజును కాని, రాజకుమారుని కాని సదా ప్రశంసించే వాడు మంత్రియో, ఆస్థానపండితుడో అయి రాజుకు ప్రియుడై చిరకాలం రాజసభలో మనగలుగుతాడు. (39)
ప్రగృహీతశ్చ యోఽమాత్యః నిగృహీతస్త్వకారణైః।
న నిర్వదతి రాజానం లభతే సంపదం పునః॥ 40
ప్రత్యక్షం చ పరోక్షం చ గుణవాదీ విచక్షణః।
ఉపజీవీ భవేద్ రాజ్ఞః విషయే యోఽపి వా భవేత్॥ 41
మొదట రాజుచే స్వీకరింపబడిన మంత్రి అకారణం గానే బహిష్కరింపబడినా, కారాగారమం దుంచబడినా ఆ మంత్రి రాజును ద్వేషింపనిచో, నిందింపనిచో మళ్లీ సంపదను పొందుతాడు. రాజుయొక్క రాజ్యమందు కానీ, కొలువులోకానీ ఉన్న నేర్పరి ప్రత్యక్షంగాకాని, పరోక్షంగాకాని రాజుగుణాలనే చెప్పాలి. (దోషాలు చెప్పరాదు) (40,41)
అమాత్యో హి బలాద్ భోక్తుం రాజానం ప్రార్థయేత యః।
న స తిష్ఠేచ్చిరం స్థానం గచ్ఛేచ్చ ప్రాణసంశయమ్॥ 42
రాజును బలవంతంగా లొంగదీసుకోవాలనుకొనే మంత్రి ఎంతో కాలం ఆ పదవిలో నిలవడు. అతని ప్రాణాలకు కూడ ముప్పు కలుగుతుంది. (42)
వి॥సం॥ ఇచట భోక్తుం అనగా కుటిలముగా చేయుట అని అర్థము. 'భుజ కౌటిల్యే' అని ధాతువు. (నీల)
శ్రేయః సదాఽత్మనో దృష్ట్వా పరం రాజ్ఞా న సంవదేత్।
విశేషయేచ్చ రాజానం యోగ్యభూమిషు సర్వదా॥ 43
ఎప్పుడైనా తన శ్రేయస్సుకు భంగం కలిగే పక్షంలో రాజుతో ఇతరులను కలవనీయరాదు. సంవాదం చేయనీయరాదు. యోగ్యవిషయాల్లో/ స్థలాల్లో రాజుకు తన చాతుర్యాన్ని చూపాలి. (43)
అమ్లానో బలవాన్ శూరః ఛాయేవానుగతః సదా।
సత్యవాదీ మృదుదుర్దాంతః స రాజవసతిం వసేత్॥ 44
ఉత్సాహవంతుడు, బలవంతుడు, శూరుడూ, సత్యవాదీ అయి మృదుత్వంతో, ఇంద్రియ నిగ్రహంతో రాజును ఎల్లప్పుడూ నీడవలె అనుసరించేవాడు రాజాస్థానంలో చిరకాలం ఉంటాడు. (44)
అన్యస్మిన్ ప్రేష్యమాణే తు పురస్తాద్ యః సముత్పతేత్।
అహం కిం కరవాణీతి స రాజవసతిం వసేత్॥ 45
రాజు ఎవరినయినా ఎక్కడికో పంపాలనుకొన్నపుడు తానై ముందుకువచ్చి 'నే నేమి చేయ గల్గుదును' అని రాజుకు తన ఉత్సాహం తెల్పినవాడు రాజాస్థానంలో చిరకాలం ఉంటాడు. (45)
అంతరే చైవ బాహ్యే చ రాజ్ఞా యశ్చాథ సర్వదా।
ఆదిష్టో నైవ కంపేత స రాజవసతిం వసేత్॥ 46
అంతఃపురకార్యాల్లో కాని, శత్రువులను జయించడం మొదలైన బాహ్యవిషయాల్లో కాని నియుక్తుడై ఎప్పుడూ చలించకుండా, సంశయించకుండా వర్తించేవాడు రాజాస్థానంలో చిరకాలం ఉంటాడు. (46)
వి॥సం॥ ఇచట అభారేచైవ భారేచ అని అర్జునమిశ్ర, చతుర్భుజమిశ్ర, విషమపదవివఱణ పాఠాలు - తేలికయిన, బరువైన్ అని అర్థం.
యో వై గృహేభ్యః ప్రవసన్ ప్రియాణాం నానుసంస్మరేత్।
దుఃఖేన సుఖమన్విచ్ఛేత్ స రాజవసతిం వసేత్॥ 47
సేవకుడు రాచకార్యంమీద ఇతర ప్రదేశాలకు వెళ్లినపుడు ఇంటి దగ్గరనున్న భార్యాపుత్రులను/భోగాలను స్మరింపరాదు. సుఖం కోరుకొనే సేవకుడు కష్టపడి పనిచేస్తే రాజాస్థానంలో చిరకాలం మనగలుగుతాడు. (47)
వి॥తె॥ తిక్కన దీన్ని మరింత వివరించాడు.
ఎండకు వానకోర్చి తనయిల్లు ప్రవాసవుఁజోటు నాక యా
కొండు నలంగుదు న్నిదురకుం దఱి దప్పెడు దప్పివుట్టె నొ
క్కండన యెట్లొకో యనక కార్యము ముట్టినచోట నేలినా
తండొకచాయ చూపినను దత్పరతం బలిసేయుటోప్పగున్..
సమవేషం న కుర్వీత నోచ్పైః సంనిహితో వసేత్।
న మంత్రం బహుధా కుర్యాత్ ఏవం రాజ్ఞః ప్రియో భవేత్॥ 48
రాజుతో సమానంగా అతిశయమైన వేషభూషణాలు ధరింపరాదు. రాజుకు మరీ సన్నిహితుడుగా ఉండరాదు. ఎక్కువగా రాజుతో ఆలోచన చేయరాదు. (రహస్యం బయట పెట్టరాదు) ఇలా ఉంటే అతడు రాజుకు ప్రీతిపాత్రు డవుతాడు. (48)
న కర్మణి నియుక్తః సన్ ధనం కించిదపి స్పృశేత్।
ప్రాప్నోతి హి హరన్ ద్రవ్యం బంధనం యది వా వధమ్॥ 49
రాజకార్యంలో నియుక్తుడైనవాడు రాజద్రవ్యం కొద్దిగా కూడా ముట్టుకోరాదు. అలా హరిస్తే వాడు బంధనంకాని, మరణంకాని పొందుతాడు. (49)
వి॥తె॥ 'మహీనాయకు సొమ్ము పామునెమ్ములుగా భావించి స్పృశింపరాద'ని తిక్కన వివరణ. (1-136)
యానం వస్త్రమలంకారం యచ్చాన్యత్ సంప్రయచ్ఛతి।
తదేవ ధారయేన్నిత్యమ్ ఏవం ప్రియతరో భవేత్॥ 50
రాజు వాహనంకాని, వస్త్రంకాని, భూషణంకాని, మరేదైనా కాని ఇస్తే సేవకుడు దానినే నిత్యమీ ధరించాలి. అలా చేస్తే రాజుకు అతడు మిక్కిలి ఇష్టు డవుతాడు. (50)
ఏవం సంయమ్య చిత్తాని యత్నతః పాండునందనాః।
సంవత్సర మిమం తాత తథా శీలా బుభూషత।
అథ స్వవిషయం ప్రాప్య యథాకామం కరిష్యథ॥ 51
పాండుకుమారులారా! ఈవిధంగా ప్రయత్నించి మీ మనస్సులను చిక్కబట్టుకొని ఈ సంవత్సరం ఇలా ప్రవర్తించండి. తరువాత మీ రాజ్యం పొంది మీరు యథేచ్ఛగా ప్రవర్తించవచ్చు. (51)
యుధిష్ఠిర ఉవాచ
అనుశిష్టాః స్మ భద్రం తే నైతద్ వక్తాస్తి కశ్చన।
కుంతీం ఋతే మాతరం నః విదురం వా మహామతిమ్॥ 52
ధర్మరాజు ఇలా అన్నాడు. మహాత్మా! మీకు శుభమగుగాక. మేము ఇపుడు మీ శిక్షణ పొందాము. మా తల్లి కుంతీదేవి, మహాబుద్ధిశాలి విదురుడు తప్ప ఈ విధంగా ఎవరూ చెప్పలేరు. (52)
వి॥తె॥ తల్లియు, తండ్రియు, దైవము
నెల్ల సుహృజ్జనము మీర"
అని ధౌమ్యుని ధర్మజాదులు ప్రశంసించారు. కుంతిని = తల్లిని, విదురుని = తండ్రిని, ఇంకా ఇద్దరిని దైవాన్ని, స్నేహితుణ్ణి చేర్చాడు తిక్కన ధౌమ్యునిలో. (1-142)
యదేవానంతరం కార్యం తద్ భవాన్ కర్తు మర్హతి।
తారణాయాస్య దుఃఖస్య ప్రస్థానాయ జయాయ చ॥ 53
ఈ దుఃఖంనుండి గట్టెక్కటానిని, మా ప్రయాణానికీ, జయానికీ చేయదగిన అనంతరకార్యం మీరు చేయవచ్చును. (53)
వి॥ ఇక్కడ నీకకంఠుడు అనంతరకార్యమంటే.. శాంతికం, పౌష్టికం.. అని వివరించాడు.
వైశంపాయన ఉవాచ
ఏవ ముక్త స్తతో రాజ్ఞా ధౌమ్యైఽథ ద్విజసత్తమః।
అకరోద్ విధివత్ సర్వం ప్రస్థానే యద్విధీయతే॥ 54
వైశంపాయను డిట్లన్నాడు. ధర్మరాజు ఇలా చెప్పగానే బ్రాహ్మణోత్తముడయిన ధౌమ్యుడు ప్రయాణానికి అవసరమైన సర్వమూ యథావిధిగా చేశాడు. (54)
తేషాం సమిధ్య తానగ్నీన్ మంత్రవచ్చ జుహావ సః।
సమృద్ధివృద్ధి లాభాయ పృథివీవిజయాయ చ॥ 55
పాండవుల అగ్నిహోత్రాలను ప్రజ్వలింపజేసి సమృద్ధి, వృద్ధి, పృథివీవిజయం కలగాలని(రాజ్యలాభం) సమంత్రకంగా హోమం చేశాడు. (55)
అగ్నీన్ ప్రదక్షిణీకృత్య బ్రాహ్మణాంశ్చ తపోధనాన్।
యాజ్ఞసేనీం పురస్కృత్య షడేవాథ ప్రవవ్రజుః॥ 56
పాండవులు అగ్నిహోత్రాలకూ, బ్రాహ్మణులకూ, తాపసులకూ ప్రదక్షిణం చేసి ద్రౌపదిని ముందు నిలిపి ఆరుగురే పయనమయ్యారు. (56)
వి॥సం॥ అత్యంతికేషు కార్యేషు నారీ కార్యా పురస్సరా।
సర్వేషు ధర్మకార్యేషు నారీ దక్షిణతో మతా॥
సర్వేషు కామకార్యేషు నారీ వామా ప్రశస్యతే।
పితృకార్యేషు సతతం నారీ వామకరానుగా॥
ప్రధానమైన కార్యాలలో స్త్రీలు ముందు నడవాలి. ధర్మకార్యాలలో కుడివైపు, కామకార్యాలలో ఎడమవైపు, పితృకార్యాలలో ఎడమచేతిననుసరిస్తూ స్త్రీలు నిలవాలి. (విష)
గతేషు తేషు వీరేషు ధౌమ్యోఽథ జపతాం వరః।
అగ్నిహోత్రాణ్యుపాదాయ పాంచాలా నభ్యగచ్ఛత్॥ 57
వీరులైన పాండవులు వెళ్లిన తరువాత జపపరుడైన ధౌమ్యుడు అగ్నిహోత్రాలు పుచ్చుకొని పాంచాలదేశానికి వెళ్లిపోయాడు. (57)
ఇంద్రసేనాదయశ్చైవ యథోక్తాః ప్రాప్య యాదవాన్।
రథానశ్వాంశ్చ రక్షంతః సుఖమూషుః సుసంవృతాః॥ 58
పూర్వం అనుకున్నట్లుగా ఇంద్రసేనాదులు యాదవులను చేరి రథాలనూ, గుర్రాలనూ రక్షించుకొంటూ భద్రంగా, సుఖంగా ఉన్నారు. (58)
ఇతి శ్రీమహాభారతే విరాటపర్వణీ పాండవప్రవేశపర్వణి ధౌమ్యోపదేశే చతుర్థో చతుర్థోఽధ్యాయః ॥ 4 ॥
ఇది శ్రీమహాభారతమున విరాటపర్వమున పాండవప్రవేశ పర్వమను
ఉపపర్వమున ధౌమ్యోపదేశము అను నాల్గవ అధ్యాయము. (4)