154. నూట ఏబది నాల్గవ అధ్యాయము

భీముడు క్రోధవశులను జయించి సౌగంధికపుష్పాలు సంగ్రహించుట.

భీమ ఉవాచ
పాండవో భీమసేనోఽహం ధర్మరాజాదనంతరః ।
విశాలాం బదరీం ప్రాప్తః భ్రాతృభిః సహ రాక్షసాః ॥ 1
అపశ్యత్ తత్ర పాంచాలీ సౌగంధికమనుత్తమమ్ ।
అనిలోఢమితో నూనం సా బహూని పరీప్సతి ॥ 2
భీముడు పలికాడు - నేను పాండుమహారాజు కుమారుణ్ణి. ధర్మరాజు తరువాత పుట్టినవాణ్ణి. విశాల అను పేరు గల బదరీతీర్థానికి చేరి సోదరులతో సహా ఉంటున్నాను.
పాంచాల రాజకుమారి నా భార్య ద్రౌపది అక్కడ గాలివాటున పడిన సౌగంధిక పుష్పాన్ని చూచి దాని పరిమళానికి ఆనందించి ఇంకా కొన్నింటిని కోరింది. (1,2)
తస్యా మామనవద్యాంగ్యాః ధర్మపత్న్యాః ప్రియే స్థితమ్ ।
పుష్పాహారమిహ ప్రాప్తం నిబోధత నిశాచరాః ॥ 3
నేను పవిత్రురాలైన ధర్మపత్ని కోసం పుష్పాల్ని కానుకగా ఇవ్వాలని తీసుకుపోవడానికి వచ్చాను. రాక్షసులారా! తెలుసుకోండి. (3)
రాక్షసా ఉచుః
ఆక్రీడోఽయం కుబేరస్య దయితః పురుషర్షభ ।
నేహ శక్యం మనుష్యేణ విహర్తుం మర్త్యధర్మణా ॥ 4
రాక్షసులు పలికారు - ఇది కుబేరుని ఉద్యానవనం. అతనికి ఎంతో ఇష్టమైంది. మనుజధర్మాలు గల మనుష్యులు ఇక్కడ విహరింప వీలుకాదు. (4)
అప్పుడు వారందరు వృకోదరుని సమీపించి 'నీవెవరవు ఎందుకు వచ్చావు? అని' అన్నారు. (15)
మునివేషధరశ్చైవ సాయుధశ్చైవ లక్ష్యసే ।
యదర్థమభిసంప్రాప్తః తదాచక్ష్వ మహామతే ॥ 16
మునివేషం ధరించి, ఆయుధాలు గ్రహించి దేనికోసం వచ్చావు? దాన్ని పూర్తిగా చెప్పు అని ప్రశ్నించాడు. (16)
ఇథి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి లోమశతీర్థయాత్రాయాం సౌగంధికాహరణే త్రిపంచాశదధికశతతమోఽధ్యాయః ॥ 153 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రా పర్వము అను ఉపపర్వమున లోమశతీర్థయాత్రలో సౌగంధికాహరణము అను నూట ఏబది మూడవ అధ్యాయము. (153)