134. నూట ముప్పది నాలుగవ అధ్యాయము
అష్టావక్రుడు బందిని ఓడించుట.
అష్టావక్ర ఉవాచ
అత్రోగ్రసేనసమితేషు రాజన్
సమాగతేష్వప్రతిమేషు రాజసు ।
నావైమి బందిం వరమత్ర వాదినాం
మహాజలే హంసమివాదదామి ॥ 1
అష్టావక్రుడిలా అన్నాడు. ఈ సభ సాటిలేని ప్రభావం గల రాజసమూహంతో నిండి ఉంది. వీరిలో బందిని నేను గుర్తించలేను. ఒకవేల గుర్తిస్తే అగాధజలంతో హంస వలె అతన్ని తప్పక పట్టి వేయగలను. (1)
న మేఽద్య వక్ష్యస్యతివాదిమానిన్
గ్లహం ప్రపన్నః సరితామివాగమః ।
హుతాశనస్యేవ సమిద్ధతేజసః
స్థిరో భవస్వేహ మమాద్య బందిన్ ॥ 2
నీచే పరాజితులు అయిన పండితులు నీటమునిగే నియమం కల్పించబడింది. కాని నా ఎదుట నీవు ఈనాడు మాట్లాడలేవు. ప్రళయకాలాగ్ని సమీపంలో ఉన్న నది అగ్ని వేడికి ఇంకినట్లు నా ఎదుటపడిన నీ వాదశక్తి నశిస్తుంది. నా ఎదుట నిలకడగా కూర్చో. (2)
బంద్యువాచ
వ్యాఘ్రం శయానం ప్రతి మా ప్రబోధయ
ఆశీవిషం సృక్కిణీ లేలిహానమ్ ।
పదాహతస్యేహ శిరోఽభిహత్య
నాదష్టో వై మోక్ష్యసే తన్నిబోధ ॥ 3
బంది పలికాడు.
నిద్రిస్తున్న పెద్దపులిగా భావించి నన్ను మేల్కొల్పకు, దవడలను నాకే సర్పంగా అనుకో. పాదాలతో త్రొక్కి శిరస్సున కాలుమోపిన వానిని సర్పం కరవక విడువదు తెలుసుకో. (3)
యో వై దర్పాత్ సంహననోపపన్నః
సుదుర్బలః పర్వతమావిహంతి ।
తస్యైవ పాణిః సనఖో విదీర్యతే
న చైవ శైలస్య హి దృశ్యతే వ్రణః ॥ 4
బలం లేకపోయినా గర్వంతో పర్వతాన్ని చేతితో కొట్టేవాడి చేయి, గోళ్ళు చీలి నాశనం అవుతాయి. పర్వతానికి ఏ మాత్రం గాయం ఏర్పడదు. (4)
అష్టావక్ర ఉవాచ
సర్వే రాజ్ఞో మైథిలస్య మైనాకస్యేవ పర్వతాః ।
నికృష్టభూతా రాజానః వత్సా అనడుహో యథా ॥ 5
అష్టావక్రుడు పలికాడు.
మైనాకుని కంటె పర్వతాలన్నీ ఎలా చిన్నవో, లేగదూడలు ఆబోతుల కంటె ఎలా చిన్నవో అలా భూమండలంలోని రాజులందరు జనకున కంటె తక్కువ వారే. (5)
యథా మహేంద్రః ప్రవరః సురాణాం
నదీషు గంగా ప్రవరా యథైవ ।
తథా నృపాణాం ప్రవరస్త్వమేకో
బందిం సమభ్యానయ మత్సకాశమ్ ॥ 6
దేవతలలో మహేంద్రుడు, నదులలో గంగ శ్రేష్ఠమైన విధంగా రాజులలో జనకుడే గొప్పవాడు. కావున బందిని నా సమీపానికి రప్పించండి. (6)
లోమశ ఉవాచ
ఏవమష్టావక్రః సమితౌ హి గర్జన్
జాతక్రోధో బందినమాహ రాజన్ ।
ఉక్తే వాక్యే చోత్తరం మే బ్రవీహి
వాక్యస్య చాప్యుత్తరం తే బ్రవీమి ॥ 7
లోమశుడు పలికాడు - బంది సభలోకి వస్తుండగనే కోపించిన అష్టావక్రుడు గర్జిస్తూ బందితో ఇలా అన్నాడు. 'నేనడిగిన ప్రశ్నలకు నీవు సమాధానం చెప్పు. నీవు అడిగిన వాటికి నేను సమాధానం చెబుతాను.' (7)
బంద్యువాచ
ఏక ఏవాగ్నిర్బహుధా సమిధ్యతే
ఏకః సూర్యః సర్వమిదం విభాతి ।
ఏకో వీరో దేవరాజోఽరిహంతా
యమః పితౄణామీశ్వరశ్చైక ఏవ ॥ 8
ఒక్కడే అగ్ని అనేకరకాలుగా ప్రకశిస్తున్నాడు. ఒకే సూర్యుడు లోకానికి అంతటికీ వెలుగును ప్రసాదిస్తున్నాడు. శత్రునాశనం చేయగల ఇంద్రుడు ఒక్కడే వీరుడు. పితృదేవతల ప్రభువు యముడు ఒక్కడే. (8)
అష్టావక్ర ఉవాచ
ద్వావింద్రాగ్నీ చరతో వై సఖాయౌ
ద్వౌ దేవర్షీ నారదపర్వతౌ చ ।
ద్వావశ్వినౌ ద్వే రథస్యాపి చక్రే
భార్యాపతీ ద్వౌ విహితౌ విధాత్రా ॥ 9
అష్టావక్రుడు పలికాడు - ఇంద్రాగ్నులు మిత్రులు, కలిసి సంచరిస్తారు. అలాగే దేవర్షులు పర్వతనారదులు. అశ్వినీదేవతలు, రథచక్రాలు, దంపతులు ఇద్దరుగా బ్రహ్మచే సృష్టింపబడ్డారు. (9)
బంద్యువాచ
త్రిః సూయతే కర్మణా వై ప్రజేయం
త్రయో యుక్తా వాజపేయం వహంతి ।
అధ్వర్యవస్త్రిసవనాని తన్వతే
త్రయో లోకాస్త్రీణి జ్యోతీంషి చాహుః ॥ 10
బంది చెప్పాడు. ఈ ప్రజలు కర్మవశాన దేవ, నర, పశుపక్ష్యాదులుగా పుడుతున్నారు. ఋక్సామ యజుర్వేదాలు కలిసి యజ్ఞవిధిని సాగిస్తున్నాయి. అధ్వర్యులు ప్రాతఃసవనం, మధ్యాహ్నసవనం, సాయంసవనం అని మూడుయజ్ఞాలు చేస్తున్నారు. స్వర్గ, నరక, పాతాళాలు అని మూడులోకాలు, సూర్య అగ్ని చంద్రులనే మూడు జ్యోతులు ఉన్నాయి. (10)
అష్టావక్ర ఉవాచ
చతుష్టయం బ్రాహ్మణానాం నికేతం
చత్వారో వర్ణా యజ్ఞమిమం వహంతి ।
దిశశ్చతస్రో వర్ణచతుష్టయం చ
చతుష్పదా గౌరపి శశ్వదుక్తా ॥ 11
అష్టావక్రుడు అన్నాడు. బ్రాహ్మణులకు నాలుగు ఆశ్రమాలు. నాలుగు వర్ణాల వారు యజ్ఞభారం మోస్తున్నారు. ముఖ్యదిక్కులు నాలుగు. వర్ణాలు నాలుగు. అకార ఉకార మకార అర్ధమాత్రలు. వాక్కులు నాలుగు పాదాలతో కూడి ఉంటాయి. (11)
బంద్యువాచ
పంచాగ్నయః పంచపదా చ పంక్తిః
యజ్ఞాః పంచైవాప్యథ పంచేంద్రియాణీ ।
దృష్టా వేదే పంచచూడాపరాశ్చ
లోకే ఖ్యాతం పంచనదం చ పుణ్యమ్ ॥ 12
బంది పలికాడు - అగ్నులు అయిదు. పంక్తి ఛందస్తు ఐదు పాదాలు కలది. యజ్ఞాలు అయిదు. ఇంద్రియసంఖ్య అయిదు. వేదంలో పంచచోడలనే అప్సరసలు ఉన్నారు. పంచనద ప్రదేశం అన్నిటికంటె పవిత్రతమం. (12)
అష్టావక్ర ఉవాచ
షడాధనే దక్షిణామాహురేకే
షట్ చైవేమే ఋతవః కాలచక్రమ్ ।
షడింద్రియాణ్యుత షట్ కృత్తికాశ్చ
షట్ సాద్యస్కాః సర్వవేదేషు దృష్టాః ॥ 13
అష్టావక్రుడు పలికాడు. - అగ్నిస్థాపనలో దక్షిణరూపంగా ఆరు గోవులనివ్వాలి. ఆరు ఋతువులతో కాలచక్రం పూర్తి అవుతుంది. జ్ఞానేంద్రియాలు ఆరు. కృత్తికా తారలు ఆరు. వేదాల్లో సాద్యస్కం అనే యజ్ఞం ఆరు రకాలుగా కనపడుతోంది. (13)
బంద్యువాచ
సప్త గ్రామ్యాః పశవః సప్త వాన్యః
సప్తచ్ఛందాంసి క్రతుమేకం వహంతి ।
సప్తర్షయః సప్త చాప్యర్హణాని
సప్తతంత్రీ ప్రథితా చైవ వీణా ॥ 14
బంది పలికాడు - గ్రామ్యపశువులు ఏడు. ఆరణ్యక పశువులు ఏడు. ఛందస్సులు ఏడింటితో యజ్ఞం నిర్వహింపబడుతోంది. ఋషులు ఏడుగురు ప్రసిద్ధులు. పూజలో ఏడు ఉపచారాలు ఉన్నాయి. వీణతీగలు కూడ ఏడే. (14)
అష్టావక్ర ఉవాచ
అష్టా శాణాః శతమానం వహంతి
తతాష్టపాదః శరభః సింహఘాతీ ।
అష్టౌ వసూన్ శుశ్రుమ దేవతాసు
యూపశ్చాష్టాస్త్రిర్విహితః సర్వయజ్ఞే ॥ 15
త్రాసులో ఎనిమిది రాళ్ళు ఉంటాయి. సింహాన్ని చంపగల శరభమృగానికి ఎనిమిది కాళ్ళు. దేవతల్లో ఎనిమిది మంది వసువులు ఉన్నారు. యజ్ఞాల్లో ఎనిమిది కోణాల్లో యూపస్తంభ నిర్మాణం జరుగుతుంది. (15)
బంద్యువాచ
నవైవోక్తాః సామిధేన్యః పితౄణాం
తథా ప్రాహుర్నవయోగం విసర్గమ్ ।
నవాక్షరా బృహతీ సంప్రదిష్టా
నవయోగో గణనామేతి శశ్వత్ ॥ 16
బంది పలికాడు - పితృయజ్ఞంలో అగ్నిని ప్రజ్జ్వలింపచెసే సామిధేనుల సంఖుఅ తొమ్మిది. సృష్టి తొమ్మిది పదార్థాల సంయోగంతో జరుగుతుంది. బృహతీఛందానికి తొమ్మిది అక్షరాలు. ఒకటి నుంచి తొమ్మిది అంకెలే గణనకు మూలం. (16)
అష్టావక్ర ఉవాచ
దిశో దశోక్తాః పురుషస్య లోకే
సహస్రమాహుర్దశపూర్ణం శతాని ।
దశైవ మాసాన్ బిభ్రతి గర్భవత్యః
దసైరకా దశ దాశా దశార్హాః ॥ 17
సంసారంలో పురుషునికి పది దిశలు నిర్దేశింపబడ్డాయి. పదివందలతో సహస్రం ఏర్పడుతుంది. తల్లి గర్భంలో శిశువుని పదిమాసాలు మోస్తుంది. నిందింపతగినవారు పదిమంది. శరీరావస్థలు పది. పూజనీయులు కుడ పదిమందే. (17)
బంద్యువాచ
ఏకాదశైకాదశినః పశూనాం
ఏకాదశైవాత్ర భవంతి యూపాః ।
ఏకాదశ ప్రాణభృతాం వికారా
ఏకాదశోక్తా దివి దేవేషు రుద్రాః ॥ 18
పక్వేకాదశిని అనే యుగానికి పదకొండు పశువులు, పదకొండు యూపాలు ఉంటాయి. ప్రాణులకు పదకొండు వికారాలు ఉన్నాయి. స్వర్గంలోని రుద్రులు పదకొండు మంది. (18)
అష్టావక్ర ఉవాచ
సంవత్సరం ద్వాదశమాసమాహుః
జగత్యాః పాదో ద్వాదశైవాక్షరాణి ।
ద్వాదశాహః ప్రాకృతో యజ్ఞ ఉక్తో
ద్వాదశాదిత్యాన్ కథయంతీహ ధీరాః ॥ 19
అష్టావక్రుడు పలికాడు - ఒక సంవత్సరానికి పన్నెండు నెలలు. జగతీఛందానికి పాదానికి పన్నెండు అక్షరాలు ఉంటాయి. ద్వాదశాహం ప్రాకృత యజ్ఞంగా చెప్పబడింది. సూర్యులు పన్నెండు మంది అని జ్ఞానులు వర్ణిస్తున్నారు. (19)
బంద్యువాచ
త్రయోదశీ తిథిరుక్తా ప్రశస్తా
త్రయోదశద్వీపవతీ మహీ చ ।
లోమశ ఉవాచ
ఏతావదుక్త్వా విరరామ బందీ
శ్లోకస్యార్ధం వ్యాజహారాష్ట వక్రః ।
అష్టావక్ర ఉవాచ
త్రయోదశాహాని ససార కేశీ
తయోదశాదీన్యతిచ్ఛందాంసి చాహుః ॥ 20
బంది చెబుతున్నాడు - త్రయోదశి తిథుల్లో గొప్పది. భుమిపై పదమూడు ద్వీపాలు ఉన్నాయి.
లోమశుడు చెప్పాడు. ఇంతవరకు పలికి బంది ఆగిపోయాడు. మిగిలిన సగభాగాన్ని అష్టావక్రుడు చెప్పాడు.
అష్టావక్రుడు పలికాడు. కేశి అనే రాక్షసుడు శ్రీ మహావిష్ణువుతో పదమూడు రోజులు యుద్ధం చేశాడు. అతిఛందస్సు అనే ఛందస్సులో పదమూడు అక్షరాలు లేక అంతకంటె ఎక్కువ అక్షరాలు ఉంటాయి అని వేదం చెప్తోంది. (20)
తతో మహానుదతిష్ఠన్నినాదః
తూష్ణీంభూతం సూతపుత్రం నిశమ్య ।
అధోముఖం ధ్యానపరం తదానీ
మష్టావక్రం చాప్యుదీర్యంతమేవ ॥ 21
ఇది విని సూతపుత్రుడైన బంది నిశ్శబ్దంగా ఉన్నాడు. తలవంచుకుని ఆలోచనలో పడ్డాడు. అష్టావక్రుడు చెబుతుండగానే శ్రోతలలో, దర్శకులలో గొప్ప కలకలం బయలుదేరింది. (21)
తస్మింస్తథా సంకులే వర్తమానే
స్ఫీతే యజ్ఞే జనకస్యోత రాజ్ఞః ।
అష్టావక్రం పూజయంతోఽభ్యుపేయుః
విప్రాః సర్వే ప్రాంజలయః ప్రతీతాః ॥ 22
జనక చక్రవర్తి యజ్ఞం సుసంపన్నం కాగా నాలుగువైపుల కోలాహలం వ్యాపిస్తుంటే బ్రాహ్మణులు అంతా చేతులు జోడించి, అష్టావక్రుని, సమీపించిసాదరంగా నమస్కారాలు చేశారు. (22)
అష్టావక్ర ఉవాచ
అనేనైవ బ్రాహ్మణాః శుశ్రువాంసో
వాదే జిత్వా సలిలే మజ్జితాః ప్రాక్ ।
తానేవ ధర్మానయమద్య బందీ
ప్రాప్నోతు గృహ్యాప్సు నిమజ్జయైనమ్ ॥ 23
అష్టావక్రుడు అన్నాడు - బంది పూర్వం చాలమంది విద్వాంసులను శాస్త్రచర్చలో ఓడించి నీటిలో ముంచాడు. కావున ఇతనికీ ఇదే గతి పట్టాలి. ఇతనిని తీసుకువెళ్ళి నీటిలో బలవంతంగా ముంచండి. (23)
బంద్యువాచ
అహం పుత్రో వరుణస్యోత రాజ్ఞః
తత్రాస సత్రం ద్వాదశవార్షికం వై ।
సత్రేణ తే జనక తుల్యకాలం
తదర్థం తే ప్రహితా మే ద్విజాగ్ర్యాః ॥ 24
బంది పలికాడు.
నేను వరుణపుత్రుడను. నీవలె నా తండ్రి యజ్ఞం పన్నెండు సంవత్సరాలు జరుగుతోంది. దాన్ని చేయడానికి కొంతమంది శ్రేష్ఠబ్రాహ్మణులను ఎన్నుకొని నీటిలో ముంచి వరుణలోకం పంపాను. (24)
తే తు సర్వే వరుణస్యోత యజ్ఞం
ద్రష్టుం గతా ఇహ ఆయాంతి భూయః ।
అష్టావక్రం పూజయే పూజనీయం
యస్య హేతోర్జనితారం సమేష్యే ॥ 25
వారందరు వరుణుని యజ్ఞం చూడడానికి వెళ్ళారు. తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తారు. నేను పూజనీయుడు అయిన అష్టావక్రుని పూజిస్తాను. ఈయన వలన నేను నాతండ్రిని కలుస్తున్నాను. (25)
అష్టావక్ర ఉవాచ
విప్రాః సముద్రాంభసి మజ్జితా యే
వాచా జితా మేధయా వా విదానాః ।
తాం మేధయా వాచమథోజ్జహార
యథా వాచమవచిన్వంతి సంతః ॥ 26
అష్టావక్రుడు అన్నాడు.
బంది చేతిలో ఓడిన విద్వాంసులైన బ్రాహ్మణులు సముద్రంలో ముంచబడ్డారు. అతని మేధాశక్తిని నేను నా బుద్ధితో ఎలా నివారించానో నా మాటలు విన్న ఈ సభలోని విద్వాంసులే తెలుసుకోగలరు. (26)
అగ్నిర్దహన్ జాతవేదాః సతాం గృహాన్
విసర్జయంస్తేజసా న స్మ ధాక్షీత్ ।
బాలేషు పుత్రేషు కృపణం వదత్సు
తథా వాచమవచిన్వంతి సంతః ॥ 27
అగ్ని స్వభావం చేత దహనశీలి. ఆయన పరీక్షా సమయంలో సత్పురుషుల ఇండ్లను (శారీరాల్ని) దహించడు. అలాగే సత్పురుషులు వినమ్రులైన బాలకుల మాటల నుంచి మేలును మాత్రం గ్రహిస్తారు. (27)
శ్లేష్మాతకీ క్షీణవర్చాః శృణోషి
ఉతాహో త్వాం స్తుతయో మాదయంతి ।
హస్తీవ త్వం జనక వినుద్యమానః
న మామికాం వాచమిమాం శృణోషి ॥ 28
జనకా! నివు ఒక రకపు చెట్ల ఆకులో భోజనం చేసి, తేజస్సు తగ్గి, బందిమాటలు వింటున్నావు. లేదా అతని స్తోత్రాలు నిన్ను మత్తెక్కించాయి. అంకుశం దెబ్బ తిని కూడ మావటిని గుర్తించని ఏనుగువలె నామాటలు వినలేకపోతున్నావు. (28)
జనక ఉవాచ
శృణోమి వాచం తవ దివ్యరూపమ్
అమానుషీం దివ్యరూపోఽసి సాక్షాత్ ।
అజైషీర్యద్ అబందినం త్వం వివాదే
నిసృష్ట ఏష తవ కామోఽద్య బందీ ॥ 29
జనకుడు పలికాడు.
నేను దివ్యం, అలౌకికం అయిన మీ మాటను వింటున్నాను. నీవు నిజంగా దివ్య స్వరూపుడవు. నీవు శాస్త్రచర్చలో బందిని ఓడించావు. నీ కోరిక నేడు తీరింది. బంది నీ చేతిలో ఓడిపోయాడు. (29)
అష్టావక్ర ఉవాచ
నానేన జీవతా కశ్చిద్ అర్ధో మే బందినా నృప ।
పితా యద్యస్య వరుణో మజ్జయైనం జలాశయే ॥ 30
అష్టావక్రుడు అన్నాడు.
బంది జీవించి యుంటే నాకు ఏ ప్రయోజనమూ లేదు. ఇతని తండ్రి వరుణుడే అయితే తప్పక ఇతడు జలాశయంలో మునిగితీరాలి. (30)
బంద్యువాచ
అహం పుత్రో వరుణస్యోత రాజ్ఞః
న మే భయం విద్యతే మజ్జితస్య ।
ఇమం ముహూర్తం పితరం ద్రక్ష్యతేఽయమ్
అష్టావక్రశ్చిరనష్టం కహోడమ్ ॥ 31
బంది పలికాడు. నేను నిజంగా వరుణరాజ పుత్రుడను. నాకు నీటిలో మునిగితే భయం లేదు. ఈ అష్టావక్రుడు ఎప్పుడో నీటిలో మునిగిన తన తండ్రి కహోడుని ఇప్పుడే చూడగలడు. (31)
లోమశ ఉవాచ
తతస్తే పూజితా విప్రాః వరుణేన మహాత్మనా ।
ఉదతిష్ఠంస్తతః సర్వే జనకస్య సమీపతః ॥ 32
లోమశుడు పలికాడు.
పిమ్మట గతంలో నీటి మునిగిన బ్రాహ్మణులందరూ వరుణుని పూజలనందుకొని జనకుని సమీపంలో లేచి ప్రత్యక్షం అయ్యారు. (32)
కహోడ ఉవాచ
ఇత్యర్థమిచ్ఛంతి సుతాన్ జనా జనక కర్మణా ।
యదహం నాశకం కర్తుం తత్ పుత్రః కృతవాన్ మమ ॥ 33
కహోడుడు అన్నాడు.
జనకా! లోకంలో ప్రజలు సత్కర్మల ద్వారా పుత్రసంతానాన్ని ఇందుకే కోరుతారు. నే నే పనిని చేయలేకపోయానో దాన్ని నాకుమారుడు పూర్తిచేశాడు. (33)
ఉతాబలస్య బలవానుత బాలస్య పండితః ।
ఉత వావిదుషో విద్వాన్ పుత్రో జనక జాయతే ॥ 34
జనకా! ఒక్కొక్కప్పుడు బలం లేని వానికి బలవంతుడు, మూర్ఖునికి పండితుడు, అజ్ఞానికి జ్ఞానవంతుడు అయిన పుత్రులు పుడతారు. (34)
శితేన తే పరశునా స్వయమేవాంతకో నృప ।
శిరాంస్యపాహరత్వాజౌ రిపూణాం భద్రమస్తు తే ॥ 35
నీకు శుభమగుగాక! యుద్ధంలో స్వయంగా యముడు తీక్ష్ణమైన గొడ్డలితో శత్రువుల శిరస్సులను నరికివేస్తాడు. (35)
మహదౌక్థ్యం గీయతే సామ చాగ్ర్యం
సమ్యక్ సోమః పీయతే చాత్ర సత్రే ।
శుచీన్ భగాన్ ప్రతిజగృహుశ్చ హృష్టాః
సాక్షాద్ దేవా జనకస్యోత రాజ్ఞః ॥ 36
జనక చక్రవర్తి యజ్ఞంలో గొప్పదైన ఔక్థ్యసామగానం జరుగుతోంది. యథావిధిగా సోమరసం త్రాగుతున్నారు. దేవగణం ప్రత్యక్షంగా దర్శనం ఇస్తూ తమ తమ పవిత్రభాగాలను స్వీకరించారు. (36)
లోమశ ఉవాచ
సముత్థితేష్వథ సర్వేషు రాజన్
విప్రేషు తేష్వధికం సుప్రభేషు ।
అనుజ్ఞాతో జనకేనాథ రాజ్ఞా
వివేశ తోయం సాగరస్యోత బందీ ॥ 37
లోమశుడు పలికాడు - బందిచే ఓడి ముంచబడిన విప్రులు అందరు అధికతేజస్సుతో ప్రత్యక్షం అయ్యారు. రాజు ఆజ్ఞ గైకొని బంది స్వయంగా సముద్రంలో మునిగాడు. (37)
అష్టావక్రః పితరం పూజయిత్వా
సంపూజితో బ్రాహ్మణైస్తైర్యథావత్ ।
ప్రత్యాజగామాశ్రమమేవ చాగ్ర్యం
జిత్వా సౌతిం సహితో మాతులేన ॥ 38
అష్టావక్రుడు తండ్రిని పూజించి, స్వయంగా బ్రాహ్మణుల పూజలు అందుకొని, బందిని జయించి, తన మామతో కలిసి, తన ఆశ్రమానికి తిరిగివచ్చాడు. (38)
తతోఽష్టావక్రమాతురథాంతికే పితా
నదీం సమంగాం శీఘ్రమిమాం విశస్వ ।
ప్రోవాచ చైనం స తథా వివేశ
సమైరంగాశ్చాపి బభూవ సద్యః ॥ 39
కహోడుడు, తల్లి, సుజాత దగ్గర ఉండగా, అష్టావక్రునితో - 'నీవు శీఘ్రంగా సమంగానదిలో ప్రవేశించు.' అన్నాడు. తండ్రి ఆజ్ఞపై నదిలో మునిగిన అతని శరీరావయవాలు సక్రమంగా మారాయి. (39)
నదీ సమంగా చ బభూవ పుణ్యా
యస్యాం స్నాతో ముచ్యతే కిల్బిషాద్ధి ।
త్వమప్యేనాం స్నానపానావగాహైః
సభ్రాతృకః సహభార్యో విశస్వ ॥ 40
సమంగానది అష్టావక్రుని ప్రవేశంతో పుణ్యనదిగా మారింది. దీనిలో స్నానం చేసి మానవుడు పాపాన్ని పోగొట్టుకొంటాడు. కావున నీవు కూడ ధర్మరాజా! భార్యాసోదరులతో దీనిలో మునిగి ఆచమనాదులు చెయ్యి. (40)
అత్ర కౌంతేయ సహితో భ్రాతృభిస్త్వం
సుఖోషితః సహ విప్రైః ప్రతీతః ।
పుణ్యాన్యన్యాని శుచికర్మైకభక్తిః
మయా సార్ధం చరితాస్యాజమీఢ ॥ 41
నీవు నమ్మకంతో భార్యాపుత్రాదులతో, కలిసి ఇక్కడ ఒక్కరాత్రి మాత్రం ఉండి, నాతో కూడి, పవిత్రకర్మలు ఆచరిస్తూ, పుణ్యవనాలు తిరుగుతూ, యాత్రను కొనసాగించు. (41)
ఇథి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి లోమశతీర్థయాత్రాయామష్టావక్రీయే చతుస్త్రింశదధికశతతమోఽధ్యాయః ॥ 134 ॥
శ్రీమహాభారతమున వనపర్వమున లోమశతీర్థయాత్రా పర్వమను ఉపపర్వమున అష్టావక్రీయము అను నూట ముప్పది నాలుగవ అధ్యాయము. (134)