116. నూటపదునారవ అధ్యాయము
ధృతరాష్ట్రకుమారులపేర్లు.
జనమేజయ ఉవాచ
జ్యేష్ఠానుజ్యేష్ఠతాం తేషాం నామాని చ పృథక్ పృథక్ ।
ధృతరాష్ట్రస్య పుత్రాణామ్ ఆనుపూర్వ్యాత్ ప్రకీర్తయ ॥ 1
జనమేజయుడిలా అన్నాడు. ధృతరాష్ట్రుని కొడుకులను పెద్దవాడితో ప్రారంభించి వరుసలో వారి వారి పేర్లతో కూడా తెలియజేయి. (1)
వైశంపాయన ఉవాచ
దుర్యోధనో యుయుత్సుశ్చ రాజన్ దుశ్శాసనస్తథా ।
దుఃసహో దుఃశలశ్చైవ జలసంధః సమః సహః ॥ 2
విందానువిందౌ దుర్ధర్షః సుబాహుర్దుష్ప్రధర్షణః ।
దుర్మర్షణో దుర్ముఖశ్చ దుష్కర్ణః కర్ణ ఏవ చ ॥ 3
వివింశతిర్వికర్ణశ్చ శలః సత్త్వః సులోచనః ।
చిత్రోపచిత్రౌ చిత్రాక్షః చారుచిత్రశరాసనః ॥ 4
దుర్మదో దుర్విగాహశ్చ వివిత్సుర్వికటాననః ।
ఊర్ణనాభః సునాభశ్చ తథా నందోపనందకౌ ॥ 5
చిత్రబాణశ్చిత్రవర్మా సువర్మా దుర్విరోచనః ।
అయోబాహుర్మహాబాహుః చిత్రాంగశ్చిత్రకుండలః ॥ 6
భీమవేగో భీమబలః బలాకీ బలవర్ధనః ।
ఉగ్రాయుధః సుషేణశ్చ కుండోదరమహోదరౌ ॥ 7
చిత్రాయుధో నిషంగీ చ పాశీ వృందారకస్తఠ్Hఆ ।
దృఢవర్మా దృఢక్షత్రః సోమకీర్తిరనూదరః ॥ 8
దృఢసంధో జరాసంధః సత్యసంధః సదః సువాక్ ।
ఉగ్రశ్రవా ఉగ్రసేనః సేనానీర్దుష్పరాజయః ॥ 9
అపరాజితః పండితకః విశాలాక్షో దురాధరః ।
దృఢహస్త సుహస్తశ్చ వాతవేగసువర్చసౌ ॥ 10
ఆదిత్యకేతుర్బహ్వాశీ నాగదత్తోఽగ్రయాయ్యపి ।
కవచీ క్రథనః దండీ దండధారో ధనుర్గ్రహః ॥ 11
ఉగ్రభీమరథౌ వీరౌ వీరబాహురలోలుపః ।
అభయో రౌద్రకర్మా చ తథా దృడరథాశ్రయః ॥ 12
అనాధృష్యః కుండభేదీ విరావీ చిత్రకుండలః ।
ప్రమథశ్చ ప్రమాథీ చ దీర్ఘరోమశ్చ వీర్యవాన్ ॥ 13
దీర్ఘబాహుర్మహాబాహూః వ్యూఢోరుః కనకధ్వజః ।
కుండాశీ విరజాశ్పైవ దుఃశలా చ శతాధికా ॥ 14
వైశంపాయనుడిలా అన్నాడు. (ధృతరాష్ట్రుని కొడుకుల పేర్లు జ్యేష్ఠానుపూర్వంగా ఇవి) 1. దుర్యోధనుడు, 2. యుయుత్సుడు, 3. దుశ్శాసనుడు, 4. దుస్సహుడు, 5. దుశ్శలుడు, 6. జలసంధుడు, 7. సముడు, 8. సహుడు, 9. విందుడు, 10. అనువిందుడు, 11. దుర్ధర్షుడు, 12. సుబాహుడు, 13. దుష్ప్రధర్షణుడు, 14. దుర్మర్షణుడు, 15. దుర్ముఖుడు, 16. దుష్కర్ణుడు, 17. కర్ణుడు, 18. వివింశతి, 19. వికర్ణుడు, 20. శలుడు, 21. సత్త్వుడు, 22. సులోచనుడు, 23. చిత్రుడు, 24. ఉపచిత్రుడు, 25. చిత్రాక్షుడు, 26. చిత్రచాపుడు, 27. దుర్మదుడు, 28. దుర్విగాహుడు, 29. వివిత్సుడు, 30. వికటాననుడు, 31. ఊర్లనాభుడు, 32. సునాభుడు, 33. నందుడు, 34. ఉపనందుడు, 35. చిత్రబాణుడు, 36. చిత్రవర్ముడు, 37. సువర్ముడు, 38. దుర్విరోచనుడు, 39. అయోబాహుడు, 40. చిత్రాంగుడు, 41. చిత్రకుండలుడు, 42. భీమవేగుడు, 43. భీమబలుడు, 44. బలాకి, 45. బలవర్ధనుడు, 46. ఉగ్రాయుధుడు, 47. సుషేణుడు, 48. కుండోదరుడు, 49. మహోదరుడు, 50. చిత్రాయుధుడు, 51. నిషంగి, 52. పాశి, 53. వృందారకుడు, 54. దృఢవర్మ, 55. దృఢక్షత్రుడు, 56. సోమకీర్తి, 57. అనూదరుడు, 58. దృఢసంధుడు, 59. జరాసంధుడు, 60. సత్యసంధుడు, 61. సదస్సువాక్కు, 62. ఉగ్రశ్రవుడు, 63. ఉగ్రసేనుడు, 64. సేనాని, 65. దుష్పరాజయుడు, 66. అపరాజితుడు, 67. పండితకుడు, 68. విశాలాక్షుడు, 69. దురాధరుడు, 70. దృఢహస్తుడు, 71. సుహస్తుడు, 72. వాతవేగుడు, 73. సువచుడు, 74. ఆదిత్యకేతువు, 75. బహ్వాశి, 76. నాగదత్తుడు, 77. అగ్రయాయి, 78. కవచి, 79. క్రథనుడు, 80. దండి, 81. దండధారుడు, 82. ధనుర్గ్రహుడు, 83. ఉగ్రుడు, 84. భీమరథుడు, 85. వీర బాహువు, 86. అలోలుపుడు, 87. అభయుడు, 88. రౌద్రకర్మ, 89. దృఢరథుడు, 90. అనాధృష్యుడు, 91. కుండభేది, 92. విరావి, 93. ప్రమథుడు, 94. ప్రమాథి, 95. దీర్ఘరోముడు, 96. దీర్ఘబాహువు, 97. వ్యూఢోరువు, 98. కనకధ్వజుడు, 99. కుండాశి, 100. విరజుడు. (2-14)
ఇతి పుత్రశతం రాజన్ కన్యాచైవ శతాధికా ।
నామధేయానుపూర్వ్యేణ విద్ధి జన్మక్రమం నృప ॥ 15
రాజా! వీరే నూరుగురు కొడుకులు. మరొకకూతురు. వీరి పేర్లక్రమంలోనే వీరిపుట్టుక. (15)
సర్వే త్వతిరథాః శూరాః సర్వే యుద్ధవిశారదాః ।
సర్వే వేదవిదశ్చైవ సర్వే సర్వాస్త్రకోవిదాః ॥ 16
వీరందరూ అతిరథులూ, శూరులు. అందరు యుద్ధనైపుణ్యం గలవారు. అందరూ వేదవేత్తలు. అందరూ అస్త్రవిద్యలన్నింటిలో కోవిదులు. (16)
సర్వేషామనురూపాశ్చ కృతా దారా మహీపతే ।
ధృతరాష్ట్రేణ సమయే పరీక్ష్య విధివన్నృప ॥ 17
దుఃశలాం చాపి సమయే ధృతరాష్ట్రో నరాధిపః ।
జయద్రథాయ ప్రదదౌ విధినా భరతర్షభ ॥ 18
రాజా! ధృతరాష్ట్రుడు తగిన వయస్సులో వీరందరికీ బాగా విచారించి తగిన వారినిచ్చి పెళ్ళి జరిపించారు. భరతశ్రేష్ఠా! ధృతరాష్ట్రమహారాజు దుశ్శాలకు కూడా తగినసమయంలో శాస్త్రోకంగా జయద్రథునితో వివాహం జరిపించాడు. (17,18)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి ధృతరాష్ట్రపుత్రనామకథనే షోడశాధికశతతమోఽధ్యాయః ॥ 116 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున ధృతరాష్ట్రపుత్రనామకథనమను నూటపదునారవ అధ్యాయము. (116)