77. డెబ్బది ఏడవ అధ్యాయము
దేవయాని కచుని వివాహమాడగోరుట. కచుడు తిరస్కరించుట.
వైశంపాయన ఉవాచ
సమావృతవ్రతం తం తు విసృష్టం గురుణా తదా ।
ప్రస్థితం త్రిదశావాసం దేవయాన్యబ్రవీదిదమ్ ॥ 1
ఋషేరంగిరసః పౌత్ర వృత్తేనాభిజనేన చ ।
భ్రాజసే విద్యయా చైవ తపసా చ దమేన చ ॥ 2
వైశంపాయనుడిలా అన్నాడు - తనవ్రతాన్ని పూర్తిచేసికొని, గురువు అనుమతితీసికొని దేవలోకానికి బయలుదేరిన కచునితో దేవయాని ఇలా పలికింది- అంగిరస మహర్షి పౌత్రుడా! నడవడిచేత, వంశం చేత, విద్యచేత, తపస్సుచేత, ఇంద్రియనిగ్రహం చేత చక్కగా ప్రకాశిస్తున్నావు. (1,2)
ఋషిర్యథాంగిరా మాన్యః పితుర్మమ మహాయశాః ।
తథా మాన్యశ్చ పూజ్యశ్చ మమ భూయో బృహస్పతిః ॥ 3
నా తండ్రి వలెనే మహాయశస్వి అయిన అంగిరసమహర్షి కూడ నాకు గౌరవింపదగినవాడు, అలాగే బృహస్పతికూడ నాకు గౌరవింపదగినవాడు, పూజింపదగినవాడూ కూడ. (3)
ఏవం జ్ఞాత్వా విజానీహి యద్ బ్రవీమి తపోధన ।
వ్రతస్థే నియమోపేతే యథా వర్తామ్యహం త్వయి ॥ 4
తపోధనా! ఈ విషయాన్ని గ్రహించి, నేచెప్పే విషయాన్ని తెలుసుకో. విద్యావ్రతంలో నియమాన్ని స్వీకరించి ఉన్న నీవిషయంలో నేను ఎలా ఉన్నానో గ్రహించు. (4)
స సమావృతవిద్యో మాం భక్తాం భజితుమర్హసి ।
గృహాణ పాణిం విధివన్మమ మంత్రపురస్కృతమ్ ॥ 5
విద్య సమాప్తి చేసుకొన్న నీవు నీభక్తురాలైన నన్ను సేవింప దగియున్నావు. యథావిధిగా మంత్రపురస్స్రంగా నాపాణిగ్రహణం చెయ్యి. (5)
కచ ఉవాచ
పూజ్యో మాన్యశ్చ భగవాన్ యథా తవ పితా మమ ।
తథా త్వమనవద్యాంగి పూజనీయతరా మమ ॥ 6
కచుడిలా అన్నాడు - నీతండ్రి నీకు పూజ్యుడు, మాన్యుడు అయినట్లే నాఖు కూడ పూజ్యుడు, మాన్యుడూ కుడ. అలాగే నీవుకూడ ఇంకా ఎక్కువ పూజింపదగినదానవు. (6)
ప్రాణేభ్Yఓఽపి ప్రియతరా భార్గవస్య మహాత్మనః ।
త్వం భద్రే ధర్మతః పూజ్యా గురుపుత్రీ సదా మమ ॥ 7
భద్రా! మహాత్ముడైన భార్గవునికి (శుక్రాచార్యునికి) నీవు ప్రాణాలకంటె మిక్కిలి ప్రియమైన దానివి. ధర్మంప్రకారంగా గురుపుత్రివైన నీవు నాకు ఎల్లపుడు పూజింపదగినదానవే. (7)
యథా మమ గురుర్నిత్యం మాన్యః శుక్రః పితా తవ ।
దేవయాని తథైవ త్వం నైవం మాం వక్తుమర్హసి ॥ 8
దేవయానీ! నాగురువు, నీతండ్రియైన శుక్రుడు నాకు నిత్యమూ మాన్యుడు. అదేవిధంగా నీవు కూడ. కావున ఈ విధంగా నాతో మాట్లాడరాదు. (8)
దేవయాన్యువాచ
గురువుత్రస్య పుత్రో వై న త్వం పుత్రశ్చ మే పితుః ।
తస్మాత్ పూజ్యశ్చ మాన్యశ్చ మమాపి త్వం ద్విజోత్తమ ॥ 9
అసురైర్హన్యమానే చ కచ త్వయి పునః పునః ।
తదా ప్రభృతి యా ప్రీతిః తాం త్వమద్య స్మరస్వ మే ॥ 10
దేవయాని ఇలా చెప్పింది - నా తండ్రి గురుపుత్రునికి పుట్ర్హుడవు. నీవు. నాతండ్రికి నీవు పుత్రుడవు కాదు, ద్విజోత్తమా! అందువల్ల నీవుకూడ నాకు పూజ్యుడవు, మాన్యుడవూ కూడ, కచా! రాక్షసులు నిన్ను మాటిమాటికి చంపుతూంటే అప్పటినుండి నేను నీపట్ల చూపిన ప్రేమను నీవిప్పుడు ఒకసారి తలుచుకో. (9,10)
సౌహార్దే చామరాగే చ వేత్థ మే భక్తిముత్తమామ్ ।
న మామర్హసి ధర్మజ్ఞ త్యక్తుం భక్తామనాగసమ్ ॥ 11
స్నేహంలో, అనురాగంలో ఉత్తమమైన నా ప్రీతిని తెలుసుకో. ధర్మజ్ఞా! దోషంలేని నన్ను నీవు విడిచి పెట్టడం యుక్తంకాదు. (11)
కచ ఉవాచ
అనియోజ్యే నియోగే మాం నియునంక్షి శుభవ్రతే ।
ప్రసీద సుభ్రు త్వం మహ్యం గురోర్గురుతరా శుభే ॥ 12
యత్రోషితం విశాలాక్షి త్వయా చంద్రనిభాననే ।
తత్రాహముషితో భద్రే కుక్షౌ కావ్యస్య భావిని ॥ 13
భగినీ ధర్మతో మే త్వం మైవం వోచః సుమధ్యమే ।
సుఖమస్మ్యుషితో భద్రే న మన్యుర్విద్యతే మమ ॥ 14
కచుడిలా అన్నాడు - శుభవ్రతా! నియోగింపరాని కార్యంలో నీవు నన్ను నియోగిస్తున్నావు. నీవు అనుగ్రహించి. నీవునాకు గురుని కంటె ఎక్కువ గౌరవింపదగినదానవు. విశాలాక్షీ! కావ్యుని గర్భంలో నీవున్నట్లే నేనుకూడ అదేగర్భంలో నివసించాను. ధర్మంప్రకారం నీవు నాకు సోదరివి. సుమధ్యమా! నీవిలా మాట్లాడకు, నేనిక్కడ సుఖంగా నివసించాను. నాకు నీపై కోపం ఏమాత్రమూ లేదు. (12-14)
ఆపృచ్ఛే త్వాం గమిష్యామి శివమాశంస మే పథి ।
అవిరోధేన ధర్మస్య స్మర్తవ్యోఽస్మి కథాంతరే ।
అప్రమత్తోత్థితా నిత్యమ్ ఆరాధయ గురుం మమ ॥ 15
నిన్ను సెలవు అడుగుతున్నాను. నేను వెడుతున్నాను. నాకు మార్గంలో మంగళాన్ని పలుకు. మాటల మధ్యలో ధర్మానికి విరుద్ధంగా లేకుండా, నేను స్మరించదగినవాడిని - నాగురువును అప్రమత్తంగా, ముందుగాలేచి నిత్యమూ ఆరాధించు. (15)
దేవయాన్యువాచ
యది మాం ధర్మకామార్థే ప్రత్యాఖ్యాస్యసి యాచితః ।
తతః కచ న తే విద్యా సిద్ధిమేషా గమిష్యతి ॥ 16
దేవయాని అంది. కచా! ధర్మబద్ధమైన కామపురుషార్థం కోసం యాచించిన నన్ను నీవు నిరాకరిస్తే నీనేర్చుకొన్న విద్య నీకు సిద్ధిని కలిగించదు. (16)
కచ ఉవాచ
గురువుత్రీతి కృత్వాఽహం ప్రత్యాచక్షే న దోషతః ।
గురుణా చాననుజ్ఞాతః కామమేవం శపస్వ మామ్ । 17
కచుడిలా అన్నాడు - గురువుపుత్రివవటంచేత నేను తిరస్కరిస్తున్నాను. నీలోని దోషంవల్ల కాదు, గురువు దీనిని అనుమతించలేదు. నీఇష్టమైనట్లు నన్ను శపించుకో. (17)
ఆర్షం ధర్మం బ్రువాణోఽహం దేవయాని యథా త్వయా ।
శప్తో నార్హోఽస్మి శాపస్య కామతో ఽద్య న ధర్మతః ॥ 18
తస్మాద్ భవత్యాః యః కామః న తథా స భవిష్యతి ।
ఋషిపుత్రో న తే కశ్చిత్ జాతు పాణిం గ్రహీష్యతి ॥ 19
దేవయానీ! నేను ఋషిధర్మాన్ని చెపుతున్నాను. అటువంటి నన్ను నీవు శపించావు. అటువంటి శాపానికి నేను అర్హుడిని కాను. నీవు కామం వల్ల ఇపుడు శపించావు. ధర్మంతో కాదు, అందువల్ల నీకోరిక నీవు కోరుకొన్నట్లుగా జరగదు. ఋషిపుత్రుడెవ్వడూ నీపాణిగ్రహణం చెయ్యడు. (18,19)
ఫలిష్యతి న తే విద్యా యత్ త్వం మామాత్థ తత్తథా ।
అధ్యాపయిష్యామి తు యం తస్య విద్యా ఫలిష్యతి ॥ 20
నీవు నన్ను శపించినట్లుగా నావిద్య ఫలించదు. కాని నేను నేర్పిన వానికి ఆ విద్య ఫలిస్తుంది. (20)
వైశంపాయన ఉవాచ
ఏవముక్త్వా ద్విజశ్రేష్ఠః దేవయానీం కచస్తదా ।
త్రిదశేశాలయం శీఘ్రం జగామ ద్విజసత్తమః ॥ 21
వైశంపాయనుడిలా అన్నాడు - ఈ విధంగా దేవయానితో చెప్పి ద్విజశ్రేష్ఠుడైన కచుడు శీఘ్రంగా దేవలోకానికి వెళ్లాడు. (21)
తమాగతమభిప్రేక్ష్య దేవా ఇంద్రపురోగమాః ।
బృహస్పతిం సభాజ్యేదం కచం వచనమబ్రువన్ ॥ 22
అపుడు ఇంద్రుని ముందిడుకొని దేవతలందరూ బృహస్పతి దగ్గరకు వెళ్లి, పూజించి కచునితో ఇలా అన్నారు. (22)
దేవా ఊచుః
యత్ త్వయాస్మద్ధితం కర్మ కృతం వై పరమాద్భుతమ్ ।
న తే యశః ప్రణశితా భాగభాక్ చ భవిష్యసి ॥ 23
దేవతలిలా అన్నారు - మాకుహితమైన, మిక్కిలి అద్భుతమైన పనిని నీవు చేశావు. దీనివల్ల నీకు శాశ్వతమైన కీర్తి కలుగుతుంది. నీవు యజ్ఞభాగాన్ని స్వీకరించేవాడవు కాగలవు. (23)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి యయాత్యుపాఖ్యానే సప్తసప్తతితమోఽధ్యాయః ॥ 77 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున యయాత్యుపాఖ్యానమను డెబ్బది ఏడవ అధ్యాయము. (77)